కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల నుంచి బోర్డు పరీక్ష ఫీజు వసూలు చేయవద్దని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) పాఠశాలలను కోరింది. కరోనా కారణంగా చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులను, కుటుంబ పెద్దలను కోల్పోయారు. వారందరూ బోర్డు పరీక్షలో తమకు ఫీజు మినహాయింపు కావాలని సీబీఎస్ఈ ని కోరారు. దీనికి సీబీఎస్ఈ సానుకూలంగా స్పందించింది. COVID-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల నుంచి బోర్డు పరీక్ష ఫీజులను వసూలు చేయవద్దని నోటీసు ఇచ్చింది. COVID-19 మహమ్మారి దేశాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసిందని.. విద్యార్థులపై దాని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, CBSE విద్యా సంవత్సరం 2021-22 కోసం ప్రత్యేక నోటీసు ఇచ్చింది.
#cbseforstudents #cbseexams #cbse to bring relief to schools and parents the last dates for registration in classes IX &XI have been extended from 4.11.20 to 19.11.20 without late fee and from 20.11.20 to 28.11.20 with late details available at https://t.co/G6QCkY1n9C
— CBSE HQ (@cbseindia29) October 14, 2020
అలా ఇబ్బంది పడుతున్న విద్యార్థుల వద్ద నుంచి పరీక్ష ఫీజు లేదా రిజిస్ట్రేషన్ ఫీజును బోర్డు వసూలు చేయొద్దని నిర్ణయించింది. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను లేదా సంరక్షకులను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఫీజు తీసుకోవద్దని సీబీఎస్ఈ పేర్కొంది. 2022 సంవత్సరం బోర్డు పరీక్షకు హాజరుకాబోయే విద్యార్థుల సమాచారాన్ని పాఠశాలలు అప్‌లోడ్ చేయాలని సూచించిది.
CBSE : 22 మంది టీచర్లకు సీబీఎస్ఈ సత్కారం
వారి వ్యక్తిగత వివరాలు పొందపర్చాలని పేర్కొంది. బోర్డు సూచించిన వారు మినహా మిగతా అందరూ పరీక్ష ఫీజు చెల్లించాల్సిదేనని బోర్డు స్పష్టం చేసింది. బోర్డు నిబంధనల ప్రకారం రూ.1500 పరీక్ష ఫీజు చెల్లించాల్సిందే నని తెలిపింది.
టర్మ్ -1, టర్మ్-2 పరీక్ష విధానం..
సీబీఎస్సీ పరీక్షలకు రెండు టర్మ్‌లు విభజించడంతోపాటు ప్రతీ టర్మ్‌కు పరీక్ష విధానాన్ని మార్చి వేసింది. టర్మ్ -I లో కేస్-బేస్డ్ MCQ లు, అసర్షన్-రీజనింగ్ టైప్ MCQ లు, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. టర్మ్ II లో కేస్-బేస్డ్, సిచ్యుయేషన్-బేస్డ్, ఓపెన్-ఎండ్ ప్రశ్నలతో సహా షార్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ (Long Answers) ప్రశ్నలు, వివిధ ఫార్మాట్లలో ప్రశ్నలు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE, CBSE Board Exams 2021, Covid -19 pandemic, EDUCATION, Education CBSE, Students