CBSE EXAMS CLARITY ON WEEKLY TELUGU PAPER ON WEEKDAYS NCRT TEAM DISCUSSIONS WITH BOARDS EVK
CBSE Exams: పదోతరగతి తెలుగు పేపర్‌పై వారం రోజుల్లో స్పష్టత.. బోర్డులతో ఎన్సీఆర్టీ బృందం చర్చలు
ప్రతీకాత్మక చిత్రం
CBSE Exams | తెలంగాణ (Telangana) ప్రభుత్వం పదోతరగతి తెలుగు పేపర్‌పై కీలక నిర్ణయం తీసుకొంది. సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డుల గుర్తింపు పొందిన స్కూళ్లల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్ రాసి తప్పనిసరిగా విద్యార్థులు పాస్ కావాల్సి ఉంటుంది.
తెలంగాణ (Telangana) ప్రభుత్వం పదోతరగతి తెలుగు పేపర్‌పై కీలక నిర్ణయం తీసుకొంది. సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డుల గుర్తింపు పొందిన స్కూళ్లల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్ రాసి తప్పనిసరిగా విద్యార్థులు (Students) పాస్ కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది తెలుగు వార్షిక పరీక్షలను సంబంధిత బోర్డులే నిర్వహిస్తాయని అధికారికంగా తెలిపారు. మిగతా పేపర్లకు నిర్వహించినట్టుగానే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డులే తెలుగు పరీక్షనూ నిర్వహిస్తాయి. అయితే ఈ ప్రశ్నాపత్రాన్ని ఆయా బోర్డులు రూపొందిస్తాయా? లేక ఎస్సీఈఆర్టీ (NCRT) రూపొందిస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఆయా బోర్డుల్లో ప్రశ్నాపత్రాలు రూపొందించేందుకు తెలుగు నిపుణులు లేకపోవడంతో ఎస్సీఈఆర్టీ రూపొందించవచ్చని తెలుస్తున్నది. దీనిపై ఎస్సీఈఆర్టీ (NCRT) అధికారులు సంబంధిత బోర్డులతో చర్చలు జరుపుతుండటంతో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో నేరుగా 8, 9, 10 తరగతుల్లో చేరిన ఇతర రాష్ర్టాల విద్యార్థులకు మాత్రం తప్పనిసరి తెలుగు నుంచి మినహాయింపు ఉంటున్నది. ఇం దుకు వారు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి.
రాష్ట్రంలోని సీబీఎసీ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డు స్కూళ్లల్లో తెలుగు అమలు చట్టం-2018 ని తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతూ విద్యాశాఖ అధికారులు ఇటీవలే ఆయా బోర్డులకు లేఖలు రాశారు. స్కూళ్లల్లో రెండో భాషగా తెలుగును అమలు చేయాలని, లేకపోతే కఠిన చర్యలు చేపడతామని ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన తాజా గైడ్‌లైన్స్..
- తెలంగాణ రాష్ట్రంలో అన్ని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డుల స్కూళ్లు తెలుగు టీచర్లను తప్పనిసరిగా నియమించుకోవాలి.
- పాఠశాలల్లో తెలుగు పాఠ్యపుస్తకాలను వినియోగించాలి.
- ఏ స్కూల్ అయినా తెలుగును తప్పనిసరిగా అమలు చేయకుంటే తొలుత నోటీసులు జారీచేస్తారు.
RBI Grade B: ఆర్బీఐ గ్రేడ్- B ఫేజ్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
- 15 రోజుల్లో వివరణ ఇవ్వాలి. అనంతరం పరిశీలంచి అనుమతులు ఇస్తారు.
- ఏ స్కూల్ అయినా తెలుగును బోధించని పక్షంలో సబ్‌రూల్ 7 (సీ) రూల్ -2 ప్రకారం రూ.50 వేలు జరిమానా విధిస్తారు.
- రెండోసారి ఉల్లంఘిస్తే అదనంగా రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.