హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Exams: ఏప్రిల్ 26 నుంచి సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల టర్మ్‌ 2 పరీక్షలు..  నిపుణుల ప్రిపరేషన్‌ టిప్స్‌ తెలుసుకోండి!

CBSE Exams: ఏప్రిల్ 26 నుంచి సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల టర్మ్‌ 2 పరీక్షలు..  నిపుణుల ప్రిపరేషన్‌ టిప్స్‌ తెలుసుకోండి!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CBSE Exams | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్  టర్మ్ 2 పరీక్ష 2022 ఏప్రిల్ 26న ప్రారంభమవుతుంది. పరీక్షలకు దాదాపు 10 రోజుల సమయం మిగిలి ఉంది. విద్యార్థులు ఇప్పుడు ప్రిపరేషన్ చివరి రోజులలో మొత్తం సిలబస్‌ను కవర్ చేయడానికి టిప్స్..

ఇంకా చదవండి ...

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE- Central Board of Secondary Education) ప్రతి సంవత్సరం 10వ తరగతి, 12వ తరగతి బోర్డ్‌ పరీక్షలను నిర్వహిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలు బోర్డ్‌ పరీక్షలు జరగలేదు. ఈ ఏడాది మాత్రం కరోనా మళ్లీ పునరావృతమైతే విద్యార్థుల ఫలితాలకు ఇబ్బంది లేకుండా రెండు పరీక్షల విధానాన్ని అమలు చేస్తోంది. టర్మ్‌ 1, టర్మ్‌ 2గా ఈ ఏడాది CBSE బోర్డ్ పరీక్షలను జరుపుతోంది. ఇది కొత్త జాతీయ విద్యా విధానం 2020 ని అమలు చేయడంలో కూడా సహాయపడుతుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ టర్మ్ 2 పరీక్ష 2022 ఏప్రిల్ 26న ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే విద్యార్థులు పరీక్షలకు పూర్తిగా సిద్ధం కావడానికి దాదాపు 10 రోజుల సమయం మిగిలి ఉంది. విద్యార్థులు ఇప్పుడు ప్రిపరేషన్ చివరి రోజులలో మొత్తం సిలబస్‌ (Syllabus) ను కవర్ చేయడానికి ప్రయత్నించకుండా.. ఇప్పటికే చదివిన వాటిని రివిజన్‌ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బోర్డు పరీక్షకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు సహాయపడే కొన్ని సూచనలు ఇవే..

ఈ సంవత్సరం విద్యార్థులు బోర్డు పరీక్షకు సిద్ధం కావడానికి చాలా సమయం లభించింది. CBSE టర్మ్ 2 పరీక్షను సబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తున్నారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.

NEET 2022: నీట్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? టాపర్‌లు సూచిస్తున్న పుస్తకాలు ఇవే!

టైమ్‌ మేనేజ్‌మెంట్‌: బోర్డ్‌ పరీక్షకు ప్రస్తుతం 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయానికి తగిన విధంగా.. అన్ని సబ్జెక్టులను రివైజ్‌ చేసుకొనేలా విద్యార్థులు ప్రత్యేక అధ్యయన టైమ్‌టేబుల్‌ (Time Table) ను రూపొందించుకోవాలి. కష్టమైన అంశాలను మరో చదివేందుకు కూడా సమయం కేటాయించుకొంటే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. గందరగోళానికి గురి కాకుండా పది రోజుల సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొంటే విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది.

TCS Recruitment 2022: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. భారీ రిక్రూమెంట్ యోచ‌న‌లో టీసీఎస్‌.. వివ‌రాలు

కోర్సు పుస్తకాలపై దృష్టి: కొత్త పుస్తకాలను చదవడానికి విద్యార్థులు సమయం వృథా చేయకూడదు. కొత్త మెటీరియల్‌ను అధ్యయనం చేయడానికి బదులుగా NCERT పుస్తకాలను చదవడంపై విద్యార్థులు శ్రద్ధ చూపాలి. అప్పుడే మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది.

డివైడ్‌ యువర్‌ టైమ్‌: రోజుకు ఒక సబ్జెక్టు మాత్రమే చదువుతూ కూర్చోవద్దు. కష్టతరమైన సబ్జెక్టులు, సులువుగా అనిపించే వాటికి రోజులో భాగం కల్పించండి. సమర్థంగా ఆలోచించి ఉన్న సమయంలో అన్నింటిని చదివేందుకు సమయం కేటాయించుకోండి. కష్టంగా భావించే అంశాలకు ఎక్కువ సమయం కేటాయించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. సులువుగా ఉన్న అంశాలను రివిజన్‌ చేయడం కూడా మంచి ఫలితాలను అందిస్తుంది.

TS Jobs: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. ఉచిత శిక్ష‌ణ ద‌ర‌ఖాస్తుకుల రెండు రోజులే చాన్స్‌!

గతంలోని ఎగ్జామ్‌ పేపర్లను పరిశీలించాలి: గతంలో నిర్వహించిన సీబీఎస్‌ఈ పరీక్ష పత్రాలను పరిశీలించడం మేలు చేస్తుంది. గతంలో అడిగిన ప్రశ్నల సరళి, ఎగ్జామ్‌ ప్యాటర్న్‌ ఆధారంగా ఇప్పుడు పరీక్షలకు సన్నద్ధమైతే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.

నమూనా పత్రాలను పరిష్కరించండి: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శ్యాంపిల్‌ పేపర్లను పరిష్కరించాలి. దీని ద్వారా పరీక్ష ప్యాటర్న్‌ అలవాటు అవుతుంది. వేగం, రాసే సామర్థ్యం పెరుగుతాయి. ఉన్న సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నించండి. పరీక్షల సమయంలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణం. కాబట్టి విద్యార్థులు భయపడకూడదు. ఒత్తిడికి గురైనప్పుడు, కొంచెం సమయం మీకు నచ్చినది చేయండి. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. నచ్చిన పనులు చేస్తూ దృష్టిని మరల్చడం ద్వారా ఆందోళన తగ్గుతుంది. ఒత్తిడిని అధిగమిస్తే పరీక్షలను సమర్థంగా ఎదుర్కోగలరు.

First published:

Tags: CBSE, Cbse exams, EDUCATION

ఉత్తమ కథలు