హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Board Exam 2021: విద్యార్థుల అభ్యర్థనకు అంగీకారం.. సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం

CBSE Board Exam 2021: విద్యార్థుల అభ్యర్థనకు అంగీకారం.. సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(CBSE) త్వరలోనే క్లాస్ 10, క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్స్ తేదీలు ప్రకటించనున్నట్టుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(CBSE) త్వరలోనే క్లాస్ 10, క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్స్ తేదీలు ప్రకటించనున్నట్టుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తేదీల ప్రకటనకు ముందు సీబీఎస్‌ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షలు కోసం దరఖాస్తు చేసుకునే ప్రైవేటు అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోని వారిని దృష్టిలో ఉంచుకుని చివరి తేదీని పొడిగించింది. ప్రైవేటు అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీవరకు cbse.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఇప్పటివకే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏవైనా తప్పిదాలు ఉంటే డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 14 వరకు వెబ్‌సైట్‌ ద్వారా మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది.

చాలా మంది విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సీబీఎస్ఈఐ బోర్డు తెలిపింది. ప్రైవేటు అభ్యర్థుల దరఖాస్తు గడువు పూర్తయిన తర్వాత తేదీ పొడగించాల్సిందిగా, దరఖాస్తులలో తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం కల్పించాల్సిందిగా అభ్యర్థనలు వచ్చినట్టు పేర్కొంది. ఈ క్రమంలో వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని.. దరఖాస్తు చేసుకునే తేదీని పొడగించడంతో పాటు, తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించినట్టు పేర్కొంది. సీబీఎస్‌ఈ తాజా నిర్ణయంతో ఫైనల్ ఎగ్జామ్ తేదీలకు సంబంధించి కూడా బోర్డు ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుందని కొందరు విద్యార్థులు భావిస్తున్నారు.

మరోవైపు సీబీఎస్‌ఈ క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో డిసెంబర్ 10వ తేదీన ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ ద్వారా విద్యార్థుల, వారి తల్లిదండ్రుల సందేహాలకు సమాధానాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి తమకు ఉన్న ఆందోళనలను విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఇక, సీబీఎస్ఈ పరీక్షలను ఎప్పటిలాగానే ఆఫ్ ‌లైన్ ద్వారానే నిర్వహిస్తామని గతవారం సీబీఎస్ఈ బోర్డు పేర్కొంది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్నిరకాల కోవిడ్-19 మార్గదర్శకాలను పాటించనున్నట్టు చెప్పింది.

First published:

Tags: CBSE, CBSE Board Exams 2021

ఉత్తమ కథలు