సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. ఆ తరగతులకు 30 శాతం సిలబస్ తగ్గింపు

9వ తరగతి నుంచి 12 తరగతి వరకు 30శాతం సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పొఖ్రియాల్ ప్రకటించారు. తల్లిదండ్రులు, విద్యావేత్తలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

news18-telugu
Updated: July 7, 2020, 7:30 PM IST
సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. ఆ తరగతులకు 30 శాతం సిలబస్ తగ్గింపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను సిలబస్‌ను తగ్గించింది. 9వ తరగతి నుంచి 12 తరగతి వరకు 30శాతం సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్ పొఖ్రియాల్ ప్రకటించారు. తల్లిదండ్రులు, విద్యావేత్తలు, నిపుణుల నుంచి సలహాలు, సూచనలు సేకరించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

దేశంతో పాటు ప్రపంచమంతటా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు 9 నుంచి 12 తరగతుల సిలబస్‌ను తగ్గించాలని నిర్ణయించాం. సిలబస్ తగ్గింపు కోసం విద్యావేత్తల సలహాలు తీసుకున్నాం. 1500 మంది తమ విలువైన సలహాలు సూచనలు తెలిపారు. కోర్ కాన్సెప్ట్స్‌ను అలాగే ఉంచుతూ 30శాతం సిలబస్‌ను తగ్గించాలని నిర్ణయించాం.
రమేశ్ పొఖ్రియాల్





కరోనా నేపథ్యంలో ఇప్పటికే 10, 12వ తరగతుల్ని సీబీఎస్ఈ రద్దు చేసిన విషయం తెలిసిందే.కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల్ని రద్దు చేయాలని, పరీక్షలు మిగిలిన సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు వేయాలంటూ సుప్రీం కోర్టులో విద్యార్థుల తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ సందర్భంగా పరీక్షలను రద్దుచేస్తున్నట్లు తెలిపింది. ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా విద్యార్థులకు మార్కుల్ని వేయనుంది సీబీఎస్ఈ. మూడు పేపర్స్ అసెస్‌మెంట్ ద్వారా ఈ మార్కులు ఉంటాయి. జూలై 15 లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయనుంది సీబీఎస్ఈ.

కాగా, కరోనా నేపథ్యంలో మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంపైనా గందరగోళం నెలకొంది. కరోనా కేసులు తగ్గితే తప్ప క్లాసులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఐతే ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా.. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: July 7, 2020, 7:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading