CBSE Class 12 Results: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

CBSE Class 12 Results Declared | సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫలితాలు వచ్చేశాయి. ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 13, 2020, 1:24 PM IST
CBSE Class 12 Results: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
CBSE Class 12 Results: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈసారి 88.78% మంది విద్యార్థులు పాసయ్యారు. ఈ ఏడాది మెరిట్ లిస్ట్‌ను ప్రకటించలేదు సీబీఎస్ఈ. ఫలితాలను results.nic.in, cbseresults.nic.in, cbse.nic.in వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. 12 లక్షల మందికి పైనే విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 10,59,080 మంది విద్యార్థులు పాసయ్యారు. అంటే 88.78% శాతం ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 83.40 మంది మాత్రమే పాస్ కాగా ఈసారి అంతకన్నా ఎక్కువ శాతం పాస్ పర్సెంటేజీ ఉంది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలదే ఫలితాల్లో పైచేయి. 92.15 శాతం మంది అమ్మాయిలు పాస్ కాగా, 86.19 శాతం మంది అబ్బాయిలు పాసయ్యారు. ట్రాన్స్‌జెండర్ పాస్ పర్సెంటేజీ 66.67. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 292 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Railway Jobs: రైల్వేలో 196 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

ఇటీవల సీబీఎస్ఈ పరీక్షలు, ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సీబీఎస్ఈ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో ఈ పరీక్షల్ని రద్దు చేసి ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా బోర్డు పరీక్షల ఫలితాలను వెల్లడించింది సీబీఎస్ఈ. ఈ ఫలితాలతో విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నట్టైతే పెండింగ్‌లో ఉన్న పరీక్షలు రాయొచ్చు. ఈ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనుంది సీబీఎస్ఈ.
Published by: Santhosh Kumar S
First published: July 13, 2020, 1:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading