హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Class 12 Term 2: సీబీఎస్​ఈ ఎగ్జామ్స్​కు ప్రిపేర్​ అవుతున్నారా..? ఈ టిప్స్‌తో కెమిస్ట్రీలో మంచి స్కోర్ సాధించండి..

CBSE Class 12 Term 2: సీబీఎస్​ఈ ఎగ్జామ్స్​కు ప్రిపేర్​ అవుతున్నారా..? ఈ టిప్స్‌తో కెమిస్ట్రీలో మంచి స్కోర్ సాధించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12 టర్మ్​ 2 పరీక్షల్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్​ అతి ముఖ్యమైనది. కెమిస్ట్రీలో మంచి స్కోర్​ సాధించాలంటే.. ముందుగా స్కూల్​ లెవల్ సిలబస్​లోని బేసిక్స్​పై పట్టు సాధించాలి. కెమిస్ట్రీ ప్రిపరేషన్ టిప్స్ ఏవో చూద్దాం.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) క్లాస్​ 10, 12 టర్మ్ II పరీక్షల షెడ్యూల్​ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్​ 26 నుంచి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో.. ప్రణాళికాబద్దంగా ప్రిపరేషన్​ కొనసాగించాల్సి ఉంది. ప్రతి సబ్జెక్ట్​లో ఎక్కువ స్కోర్​ సాధించేందుకు కొన్ని చిట్కాలు(Tips) పాటించాలి. సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12 టర్మ్​ 2 పరీక్షల్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్​ అతి ముఖ్యమైనది. కెమిస్ట్రీలో మంచి స్కోర్​ సాధించాలంటే.. ముందుగా స్కూల్​ లెవల్ సిలబస్​లోని బేసిక్స్​పై(Basics) పట్టు సాధించాలి. ముఖ్యంగా సమ్మేళనాలు, బంధాల రకాలు, వాలెన్సీ, మోల్ కాన్సెప్ట్‌ల ఫార్ములాలపై అవగాహణ పెంచుకోవాలి.

కెమిస్ట్రీ సబ్జెక్ట్​ను మొత్తం మూడు విభాగాలుగా విభజించుకోవాలి. ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ.. వంటి మూడు విభాగాలుగా సిలబస్​ను విభజించాలి. ముందుగా కోర్​ కాన్సెప్ట్​లను బాగా అర్థం చేసుకున్న తర్వాత సబ్జెక్టు లోతులోకి వెళ్లాలి. 12వ తరగతి కెమిస్ట్రీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులందరూ మంచి స్కోర్​ కోసం కొన్ని సింపుల్​ టిక్స్ ఫాలో అవ్వాలి. అవేంటో చూద్దాం.

NMDC Jobs 2022: హైదరాబాద్‌లోని ఎన్ఎండీసీ జాబ్ నోటిఫికేషన్... రూ.1,30,000 వరకు వేతనం

 ఫిజికల్ కెమిస్ట్రీ

ఫిజికల్​ కెమిస్ట్రీలోని అన్ని యూనిట్లలో ఇచ్చిన థీరమ్స్​ గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. యూనిట్ పూర్తయిన తర్వాత పాఠ్యపుస్తకంలో ఉండే అన్ని ప్రాబ్లమ్స్​ను ప్రాక్టీస్​ చేయండి. ప్రతి యూనిట్ చివరిలో రివిజన్​ కోసం ఫ్లో చార్ట్‌ను రూపొందించండి. ఉదాహరణకు, ఎలెక్ట్రోకెమిస్ట్రీలోని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, నెర్ట్స్​ ఈక్వేషన్, న్యూమరికల్, గిబ్స్ ఎనర్జీ అండ్ ఈక్విలిబ్రియం కాన్​స్టాంట్​, మోలార్ కండక్టెన్స్ అండ్ కండక్టివిటీ, కోహ్ల్‌రాష్ లా అండ్​ వేరియేషన్​ వంటి ప్రాబ్లమెటిక్​ ఈక్వేషన్లను బాగా ప్రాక్టీస్​ చేయండి.

ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ

అయనీకరణ సంభావ్యత, ఎలక్ట్రోడ్ సంభావ్యత, ఆక్సీకరణం, స్వభావాన్ని తగ్గించడం వంటి ఇతర లక్షణాలను వివరించడానికి d, f బ్లాక్ మూలకాలు, వాటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లు, ఆక్సీకరణకు సంబంధించిన తేడాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆయా మూలకాల ప్రాపర్టీస్ సులభంగా అర్థమయ్యేలా నోట్స్​ తయారు చేసుకోండి. VBT, CFT ప్రకారం వివిధ సంక్లిష్ట సమ్మేళనాల హైబ్రిడైజేషన్, జ్యామితి, అయస్కాంత ప్రవర్తన, కాంప్లెక్స్​ కాంపౌండ్స్ కలర్స్​ గురించి క్షుణ్నంగా​ నేర్చుకోవాలి. ఈ విభాగానికి ఎక్కువ మార్కుల వెయిటేజీ ఉంది. కాబట్టి, కనీసం రెండు మూడు సార్లు క్షుణ్ణంగా చదవండి.

Scholarship: విదేశాల్లో చదువుకుంటారా? స్కాలర్‌షిప్‌కు అప్లై చేయండి ఇలా

ఆర్గానిక్ కెమిస్రీ

ప్రతి రియాక్షన్​ను పేరుతో హైలైట్ చేయండి. ముఖ్యమైన రియాక్షన్లను సంబంధిచిన మెకానిజంను బాగా అర్థం చేసుకోండి. NCERT పాఠ్యపుస్తకంలో ఇచ్చిన కన్వర్షన్​ రియాక్షన్లను బాగా ప్రాక్టీస్​ చేయండి. ఫిజికల్​ ప్రాపర్టీస్​కు సంబంధించిన రీజనింగ్ పాయంట్లతో నోట్స్ ప్రిపేర్​ చేసుకోండి. ఆర్గానిక్ రియాక్షన్‌లలో ఉపయోగించే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కాన్సెప్ట్​లు, క్రిస్టల్ లాటిస్‌లు, HCP, BCC, CCP వంటి యూనిట్ల మధ్య ఖచ్చితమైన సహ సంబంధాన్ని నిర్వహించండి. ఇవి d, f- బ్లాక్ మూలకాలను సులభంగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. మూడు టాపిక్స్​ ప్రాక్టీస్​ చేసే సమయంలోనే నోట్స్​ ప్రిపేర్​ చేసుకోండి. రివిజన్​ టైమ్​లో ఈ నోట్స్​ ఎంతగానో ఉపయోగపడుతుంది.

First published:

Tags: Career and Courses, CBSE, EDUCATION, Students

ఉత్తమ కథలు