సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.inలో ఫలితాలను చూసుకోవచ్చు. ఈ నెల 31లోగా ఫలితాలను వెల్లడించాలన్న సుప్రీంకోర్లు ఆదేశాల నేపథ్యంలో ఈ రోజు ఫలితాలను విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ 10, 12 వ తరగతి పరీక్లలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 30 శాతం, 11 వ తరగతిలో మార్కుల ఆధారంగా 30 శాతం, 12వ తరగతిలో మిడ్ టర్మ్, ప్రీ-బోర్డ్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఇలా మొత్తం 100 శాతానికి మార్కులను లెక్కించి ఫలితాలను విడుదల చేసింది సీబీఎస్ఈ బోర్డు. అభ్యర్థి రూల్ నంబర్, స్కూల్ నంబర్ ను నమోదు చేసి ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. గతేడాది జులై 13న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల చేయగా.. ఈ ఏడాది కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఫలితాల ప్రకటన ఆలస్యమైంది.
ముఖ్యమైన సమాచారం..
1. విద్యార్థులు CBSE 12 వ తరగతి మార్క్‌షీట్ & సర్టిఫికెట్‌ను అధికారిక వెబ్‌సైట్ల నుంచి మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
2. ప్రింట్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి.
3. మార్క్ షీట్‌లో ఇచ్చిన సమాచాన్ని సరి చూసుకోవాలి. ఏదైనా తప్పులు ఉంటే సంబంధిత పాఠశాలను సంప్రదించాల్సి ఉంటుంది.
వారికి మళ్లీ పరీక్షలు..
క్వాలిఫైయింగ్ మార్కులు సాధించని విద్యార్థులను కంపార్మెంట్ కేటగిరీలో ఉంచనున్నారు. అయితే.. ఈ ఫలితాలపై సంతృప్తి చెందని వారికి పరిస్థితులు చక్కబడ్డాక ఎగ్జామ్ రాసి వారి ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే బోర్డు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.