Home /News /jobs /

CBSE CLASS 10TH RESULT 2020 WILL BE DECLARE TOMORROW CONFIRMS HRD MINISTER RAMESH POKHRIYAL NISHANK SS

CBSE Class 10 Results: నేడే సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు

CBSE Class 10 Results: రేపు సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు
(ప్రతీకాత్మక చిత్రం)

CBSE Class 10 Results: రేపు సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు (ప్రతీకాత్మక చిత్రం)

CBSE Class 10 Board Result 2020 | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 10వ తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త. నేడే సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అధికారికంగా ప్రకటించారు. విద్యార్థులు సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను results.nic.in, cbseresults.nic.in, cbse.nic.in వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. జూలై 13న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో 10వ తరగతి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. టెన్త్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారని సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒక్క రోజు గ్యాప్‌తోనే సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి.


    ఇటీవల సీబీఎస్ఈ పరీక్షలు, ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా సీబీఎస్ఈ 12వ తరగతి, 10వ తరగతి పరీక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సీబీఎస్ఈ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో ఈ పరీక్షల్ని రద్దు చేసి ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా బోర్డు పరీక్షల ఫలితాలను వెల్లడిస్తోంది సీబీఎస్ఈ. ఈ ఫలితాలపై విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నట్టైతే పెండింగ్‌లో ఉన్న పరీక్షలు రాయొచ్చు. ఈ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనుంది సీబీఎస్ఈ.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 10th Class Exams, 10th class results, CAREER, CBSE, Exams, Results, Ssc exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు