సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్ 1 ఫలితాలు ఇటీవల విడుదల అయ్యాయి. మరోవైపు CBSE టర్మ్ 2 పరీక్ష తేదీలను కూడా బోర్డు ప్రకటించింది. అయితే ఫైనల్ రిజల్ట్స్ లెక్కింపులో ఒక్కో టర్మ్‌కు ఎంత వెయిటేజీ ఉంటుందన్న దానిపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. దీంతో 10వ తరగతి, 12వ తరగతి పరీక్ష ఫలితాల కోసం CBSE తుది స్కోర్‌ను లెక్కించేటప్పుడు థియరీ లేదా టర్మ్ 2 పరీక్షలకు ఎక్కువ వెయిటేజీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. టర్మ్ 1 ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయని కొందరు విద్యార్థులు పేర్కొనగా, టర్మ్ 1 పరీక్షల్లో భారీగా అవకతవకలు జరిగాయని చాలా మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం ఆరోపిస్తున్నారు. రెండు టర్మ్ లకు సమాన వెయిటేజీ ఇవ్వడం వల్ల కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సీబీఎస్‌ఈ టర్మ్ 2 పరీక్షల కోసం ఈసారి కఠిన నిబంధనలు విధించే అవకాశం ఉంది.
50 శాతం వెయిటేజీకి బదులు టర్మ్ 1 పరీక్ష ఫలితాల్లో దాదాపు 10 నుంచి 30 శాతం వెయిటేజీ తుది ఫలితాల్లో ఉండాలని, మిగిలిన మార్కులను టర్మ్ 2, ఇంటర్నల్స్ కోసం కేటాయించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. టర్మ్1 పరీక్షల సమయంలో అనేక విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని.. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ చేయడానికి సహకరించాయని ఆరోపిస్తూ కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు 2021-2022 టర్మ్ I పరీక్షల వెయిటేజీని తగ్గించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)ను కోరాయి.
#PPC2022 #ExamWarriors https://t.co/6LBqxvfilv
— CBSE HQ (@cbseindia29) March 28, 2022
ఈ విషయమై CBSE చైర్‌పర్సన్ వినీత్ జోషికి నేషనల్ ప్రోగ్రెసివ్ స్కూల్స్ కాన్ఫరెన్స్ (NPSC) లేఖ రాసింది. ఇందులో టర్మ్ I పరీక్షల వెయిటేజీని 20 శాతం నుండి 30 శాతం పరిధిలో తగ్గించాలని సూచించింది. అయితే టర్మ్ II పరీక్ష వెయిటేజీని 70 శాతం నుంచి 80 శాతం వరకు పెంచాలని కోరినట్లు తెలుస్తోంది.
@cbseindia29 cbse please reduce term 1 weightage because many students having partiality please !!! See our pain and reduced the weightage of term 1 and increased the weightage of term 2
And please think about it once for weightage??? — Rooppratap Rathore (@RooppratapR) March 28, 2022
అయితే ఇంత వివాదం నడుస్తున్నా ఇప్పటికీ టర్మ్ 1, టర్మ్ 2 పరీక్షల వెయిటేజీపై సీబీఎస్‌ఈ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. టర్మ్-I , టర్మ్-II పరీక్షల వెయిటేజీని టర్మ్-II రిజల్ట్స్ ప్రకటించే సమయంలో నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. టర్మ్ 1 పరీక్షలకు 50 శాతం వెయిటేజీ ఉంటుందని, మిగిలిన 50 శాతం వెయిటేజీని టర్మ్ 2, ఇంటర్నల్ అసెస్‌మెంట్‌కు ఇవ్వాలని గతంలో సీబీఎస్‌ఈ ప్రకటించింది. ఈ ప్రకటనపై విద్యార్థులు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
#cbseterm1result Dear CBSE please be fair to future to us Reduce weitage of term 1 to 10% or make result on the basis of term 2 completely Many malpractices have been done Student who study fairly will get marks in term 2 also, please@cbseindia29@EduMinOfIndia
— Mango man (@good2B_bad) March 27, 2022
Cbse should reduce Weightage of term 1 because of cheating in various schools. we got low marks because we didn't cheat and it is unfair with students who studied whole year #reduceterm1weightage#cbseterm1@Cbse_official @CBSEWaleBhaiya @AllCBSENews
— Gauresh Pathak (@GaureshPathak2) March 27, 2022
కాగా, ఒక విద్యార్థి మొత్తం మార్కులు రెండు పరీక్షల ఆధారంగా లెక్కిస్తారు. 2022 బోర్డు పరీక్షలను రెండు పర్యాయాలు నిర్వహిస్తామని గతేడాది సీబీఎస్‌ఈ ప్రకటించింది. అందుకు అనుగుణంగానే గతేడాది నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 మధ్య ప్రధాన సబ్జెక్టులకు టర్మ్-1 పరీక్షలను నిర్వహించింది. టర్మ్-2 పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు ఇప్పటికే విడుదల చేయగా, ఈ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.