హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Class 10 Result 2021: సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్ చెక్ చేసుకోండి

CBSE Class 10 Result 2021: సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్ చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలను ఈ రోజు విడుదల చేశారు. అభ్యర్థులు ఈ లింక్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.

గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్నా సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. విద్యార్థులు cbseresults.nic.in, cbse.gov.in, cbse.nic.in వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో విద్యార్థులు ఇంటర్నల్ అసెస్మెంట్, అర్ధ సంవత్సరం లేదా మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్‌ పరీక్షలలో పనితీరు ఆధారంగా విద్యార్థులకు మార్కులు కేటాయించారు. వాస్తవానికి జులై 20న ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. కానీ పాఠశాలలు విద్యార్థుల మార్కులకు సంబంధించిన జాబితాను పంపించడంలో ఆలస్యం చేయడంతో ఫలితాల విడుదలను అధికారులు వాయిదా వేశారు.

రూల్ నంబర్ తెలియని విద్యార్థులు తెలుసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది..

-అభ్యర్థులు ముందుగా cbse.nic.in వెబ్ సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

-పేజీని స్క్రోల్ డౌన్ చేస్తే “Roll Number Finder” అనే అప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే వేరే పేజీ ఓపెన్ అవుతుంది. అనంతరం క్లాస్ 10పై క్లిక్ చేయాలి.

-తర్వాత వివరాలను సమర్పించి సెర్చ్ డేటా ఆప్షన్ పై క్లిక్ చేస్తే రూల్ నంబర్ తెలుసుకోవచ్చు.

రిజల్ట్ చెక్ చేసుకోండిలా..

-అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.

-అనంతరం రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.

-లాగిన్ వివరాలను నమోదు చేస్తే మీ ఫలితాలు కనిపిస్తాయి.

-ఆ రిజల్ట్ పేజీని డౌన్ లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలు ఇలా..

-అభ్యర్థులుCBSE10 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రూల్ నంబర్ టైప్ చేయాలి.

-ఈ మెసేజ్ ను 7738299899 నంబర్ కు పంపించాల్సి ఉంటుంది.

-ఇలా చేస్తే రిజల్ట్ మీ ఫోన్ కు ఎస్ఎంఎస్ ద్వారా పంపించబడుతుంది.

First published:

Tags: CBSE, CBSE Board Exams 2021

ఉత్తమ కథలు