హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Class 10 Results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయి... చెక్ చేయండి ఇలా

CBSE Class 10 Results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయి... చెక్ చేయండి ఇలా

CBSE Class 10 Results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయి... చెక్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

CBSE Class 10 Results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయి... చెక్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

CBSE Class 10 Result 2020 | సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. రెండు రోజుల క్రితం 12వ తరగతి రిజల్ట్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో టెన్త్ రిజల్ట్స్‌పై ఉత్కంఠ పెరిగింది. సుమారు 18 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బుధవారం ఫలితాలు విడుదల చేస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్లాస్ 10 ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. విద్యార్థులు ఫలితాలను results.nic.in, cbseresults.nic.in, cbse.nic.in వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. 12వ తరగతి లాగే 10వ తరగతి ఫలితాల్లో మెరిట్ లిస్ట్ విడుదల చేయలేదు సీబీఎస్ఈ. ఫలితాలు ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

CBSE Class 10 Results: ఫలితాలు చెక్ చేయండి ఇలా


విద్యార్థులు ముందుగా cbseresults.nic.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో క్లాస్ 10 ఫలితాలకు సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయాలి.

విద్యార్థులు తమ వివరాలతో లాగిన్ కావాలి.

లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ పైన ఫలితాలు కనిపిస్తాయి.

ఫలితాల కాపీని ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్లతో పాటు డిజీలాకర్‌, మైక్రోసాఫ్ట్, ఉమాంగ్ యాప్స్‌లో కూడా విద్యార్థులు ఫలితాలు చెక్ చేయొచ్చు. ఐవీఆర్ఎస్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం విద్యార్థులు <CBSE10>space<Roll no>space<Admit card id> అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. 011-224300699 నెంబర్‌కు కాల్ చేసి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.

ఇటీవల సీబీఎస్ఈ పరీక్షలు, ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న ఎగ్జామ్స్ నిర్వహించేందుకు సీబీఎస్ఈ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించడంతో ఈ పరీక్షల్ని రద్దు చేసి ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా బోర్డు పరీక్షల ఫలితాలను వెల్లడించింది సీబీఎస్ఈ. ఈ ఫలితాలతో విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నట్టైతే పెండింగ్‌లో ఉన్న పరీక్షలు రాయొచ్చు. ఈ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటించనుంది సీబీఎస్ఈ.

First published:

Tags: 10th Class Exams, 10th class results, CAREER, CBSE, EDUCATION, Exams, Results, Ssc exams

ఉత్తమ కథలు