Home /News /jobs /

CBSE CLASS 10 EXAM TERM 2 HERE FULL DETAILS ABOUT MATHS EXAM PATTERN AND SYLLABUS NS

CBSE Class 10 Math's: సీబీఎస్ఈ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. టర్మ్-2 మాథ్స్ సిలబస్ పై ఇదే.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటికే సీబీఎస్ఈ టర్మ్ 1 ఎగ్జామ్స్ ముగిసిన విషయం తెలిసిందే. అయితే టర్మ్ 2 ఎగ్జామ్స్ త్వరలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టర్మ్ 2 మాథ్స్ సిలబస్ విద్యార్థుల కోసం..

    కరోనా (Corona) ప్రత్యేక పరిస్థితుల కారణంగా విద్యావ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. అనేక బోర్డులు తమ సిలబస్ ను తగ్గించాయి. విద్యార్థులపై (Students) ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ (CBSE) బోర్డ్ సైతం సిలబస్ ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 30 శాతం సిలబస్ ను సైతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు టర్మ్ లుగా ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది సీబీఎస్ఈ బోర్డ్. ఇప్పటికే సీబీఎస్ఈ టర్మ్ 1 ఎగ్జామ్స్ ముగిసిన విషయం తెలిసిందే. అయితే టర్మ్ 2 ఎగ్జామ్స్ త్వరలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టర్మ్ 2 మాథ్స్ సిలబస్ విద్యార్థుల కోసం..

    ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు అంటే..
    Algebra నుంచి 10 మార్కులు, Geometry నుంచి 09, Trigonometry-Applications నుంచి 7, Mensuration, 06, Statistics & Probability నుంచి 08 మార్కులకు ప్రశ్నలను అడగనున్నారు. ఇంటర్నల్ అసెస్మెంట్ కు 10 మార్కులు ఉంటాయి. మొత్తం 50 మార్కులకు మాథ్స్ టర్మ్-2 ఎగ్జామ్ ఉంటుంది.
    CBSE 12th Biology: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ప్రిపరేషన్ టిప్స్.. బయాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవే..



    ఇంకా సిలబస్ విషయానికి వస్తే..
    -Algebraలో Quadratic Equations, Arithmetic Progressions అంశాలు ఎగ్జామ్స్ లో అడుగుతారు
    -Geometryలో Circles, Construction విభాగాలు ఉంటాయి.
    -ఇంకా Trigonometryలో Some Applications Of Trigonometry ఉంటుంది.
    -Mensuration యూనిట్లో Surface Areas and Volumes అంశాలు టర్మ్ 2 సిలబస్ లో ఉంటాయి.
    -Statistics and Probability యూనిట్లో Statistics పార్ట్ ఉంటుంది.
    CBSE Term 2: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ప్రిపరేషన్ టిప్స్.. ఇంగ్లీష్‌లో ఎక్కువ మార్కులకు ఇలా చేయండి..

    ఇది ఇలా ఉంటే.. టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభమవుతాయని CBSE ఇప్పటికే ప్రకటించింది. టర్మ్ 1లో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ లో జరిగాయి. ఇందులో మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఒక ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి. వీటిలో సరైన సమాధానాన్ని విద్యార్థి గుర్తించాల్సి ఉంటుంది. ఇక, టర్మ్ 2, పేపర్లు సబ్జెక్టివ్‌గా ఉంటాయి. ఇందులో పెద్ద, చిన్న , మధ్య ప్రశ్నలకు సెక్షన్ వైజ్‌గా సమాధానలు రాయాల్సి ఉంటుంది. ఇందులోనూ చాయిస్ ఉంటుంది. టర్మ్ 1 ఫలితాలను ప్రకటించిన తర్వాత టర్మ్ 2 కు సంబంధించిన వివరాలను ప్రకటించాలని సీబీఎస్ఈ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Career and Courses, CBSE, Exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు