CBSE Results 2020: సీబీఎస్ఈ టెన్త్ కంపార్ట్‌మెంట్ ఫ‌లితాలు విడుద‌ల.. ఈ లింక్ తో చెక్ చేసుకోండి

CBSE Results 2020: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-సీబీఎస్ఈ సోమవారం పదో తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 56.55 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు తెలిపింది.

news18-telugu
Updated: October 12, 2020, 4:51 PM IST
CBSE Results 2020: సీబీఎస్ఈ టెన్త్ కంపార్ట్‌మెంట్ ఫ‌లితాలు విడుద‌ల.. ఈ లింక్ తో చెక్ చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-సీబీఎస్ఈ సోమవారం పదో తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 56.55 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు తెలిపింది. ఈ సీబీఎస్ఈ పదో తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్ సైట్ cbse.nic.inలో విడుదల చేశారు. మొత్తం 1,57,866 మంది విద్యార్థులు పరీక్ష రాయడానికి నమోదు చేసుకున్నారు. అందులో 1,49,726 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 82,903 మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని అధికారులు ప్రకటించారు.


ఈ పరీక్షలను సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పరీక్షలు ముగిసిన అనంతరం అతి కొద్ది రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు. ఉత్తీర్ణత శాతం 56.55గా నమోదైందని తెలిపారు. సీబీఎస్ఈ పది, 12వ తరగతి విద్యార్థులకు కంపార్ట్‌మెంట్ పరీక్షలను సెప్టెంబర్ 22 నుంచి నిర్వహించారు. దేశంలో కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనేక జాగ్రత్త చర్యలు పాటిస్తూ ఈ పరీక్షలను నిర్వహించారు.



CBSE Class 10th Compartment Result 2020-Direct Link

ఫలితాలు తెలుసుకోవడం ఎలా?
-విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్ సైట్ cbse.nic.in ఓపెన్ చేయాలి.
- తర్వాత రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.
-రూల్ నంబర్, ఇతర వివరాలను ఉపయోగించి లాగిన్ కావాలి.

-అనంతరం మనకు రిజల్ట్ కనిపిస్తుంది. కాపీని మనం డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Published by: Nikhil Kumar S
First published: October 12, 2020, 4:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading