ఎట్టకేలకు ఈ రోజు సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ ప్రకటన చేశారు. షెడ్యూల్ ను సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేయనున్నారు. విద్యార్థులు https://www.cbse.gov.in/newsite/index.html ద్వారా షెడ్యూల్ ను చూసుకోవచ్చు. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. గత డిసెంబర్ 31న సీబీఎస్ఈ బోర్డు పరీక్షల తేదీలను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. మే 4 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని ఆయన వెల్లడించారు. జూన్ 10న పరీక్షలు ముగుస్తాయన్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు.
కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల్లో ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. జూలై 15న ఫలితాలను వెల్లడిస్తామన్నారు. ప్రాక్టికల్స్ పరీక్షలు మే 1న ప్రారంభం అవుతాయని వివరించారు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సిలబస్ ను 30 శాతం తగ్గించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th Class Exams, CBSE, CBSE Board Exams 2021, Exams