హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE date sheet 2022: సీబీఎస్​ఈ పరీక్షల టైం టేబుల్ విడుదల.. పరీక్షలు తేదీలు ఇక్కడ తెలుసుకోండి

CBSE date sheet 2022: సీబీఎస్​ఈ పరీక్షల టైం టేబుల్ విడుదల.. పరీక్షలు తేదీలు ఇక్కడ తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్  (CBSE) 10, 12 వ తరగతుల  టర్మ్-​‌‌1  పరీక్షల టైం టేబుల్ (time table)​ 2021-22lని బోర్డు విడుదల చేసింది. ఈ  పరీక్షలను నవంబర్-డిసెంబర్‌లో ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12 వ తరగతుల  టర్మ్-​‌‌1 (term 1)  పరీక్షల టైం టేబుల్ ( Exam Time table)​ 2021-22ని బోర్డు విడుదల చేసింది. ఈ  పరీక్షలను నవంబర్-డిసెంబర్‌లో ఆఫ్‌లైన్‌ (offline)లో నిర్వహిస్తుంది.అయితే  CBSE గత సంవత్సరం వరకు అనుసరించిన వార్షిక పరీక్ష (Annual exam) సరళికి బదులుగా ఈ సారి రెండు బోర్డు పరీక్ష (board exams)లను నిర్వహిస్తుంది. సెకండరీ , సీనియర్ సెకండరీ విద్యార్థులకు టర్మ్ 2 (term 2) పరీక్షలు ఫిబ్రవరి-మార్చి 2022 లో నిర్వహించనున్నారు.

10 వ తరగతి టర్మ్​ -1 పరీక్షలు నవంబర్ 30..

10 వ తరగతి టర్మ్​ -1 పరీక్షలు నవంబర్ 30 (November 30) న ప్రారంభమై డిసెంబర్ 11 న ముగుస్తాయి, అయితే  12 వ తరగతి పరీక్షలు డిసెంబర్ 1 న ప్రారంభమై డిసెంబర్ 22 న ముగుస్తాయి. రెండవ టర్మ్ పరీక్ష మార్చి-ఏప్రిల్ 2022 లో నిర్వహించబడుతుంది మరియు ఇది ఆబ్జెక్టివ్ లేదా సబ్జెక్టివ్​ విధానం (subjective-type)​ అనేది దేశంలోని కోవిడ్ పరిస్థితి (covid situation)పై ఆధారపడి ఉంటుంది.  విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్- cbse.gov.in లో డేట్​ షీట్​ (date sheet)​ను డౌన్​లోడ్ (download)​ చేసుకోవచ్చు.

90 నిమిషాలు..

పరీక్షలు ఆబ్జెక్టివ్​ విధానం (Objective type) ఉంటుంది. పరీక్ష కాల వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది. శీతాకాలం (winter) కావడంతో ఉదయం 11.30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.

మార్కుల రూపంలో ఫలితాలు..

సీబీఎస్‌ఈ (CBSE) పరీక్షల నియంత్రణాధికారి సన్యామ్ భరద్వాజ్ (Sanyam Bhardwaj) మాట్లాడుతూ..  టర్మ్ -1 పరీక్ష ముగిసిన తర్వాత, మార్కుల రూపంలో ఫలితాలు ప్రకటించబడతాయని చెప్పారు. మొదటి టర్మ్ ( First Term) తర్వాత పాస్ (pass), కంపార్ట్మెంట్ (Compartment) ఎసెన్షియల్ రిపీట్ కేటగిరీ (essential repeat categories)లలో ఏ విద్యార్థిని ఉంచరని తెలిపారు. మొదటి, రెండవ టర్మ్ పరీక్షల తర్వాత తుది ఫలితాలు ప్రకటించబడతాయని అన్నారు.

50% మార్కులు..

ఆయన మాట్లాడుతూ.. “మొదటి టర్మ్ పరీక్షలు (First term exams) ముగిసేలోపు పాఠశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు లేదా ఇంటర్నల్ అసెస్‌మెంట్ పూర్తవుతుంది. సిలబస్‌ (syllabus)లో చెప్పినట్లుగా మొత్తం మార్కులలో 50% మార్కులు కేటాయించాం. పాఠశాలలకు పూర్తి వివరాలు ప్రత్యేకంగా తెలియజేస్తాం, తద్వారా వారు అవసరమైన సన్నాహాలు చేసుకోవచ్చు ”

ఇక పదో తరగతి పరీక్షలు నవంబర్​ 30న ప్రారంభం అవుతాయి.


10th date sheet

Class_X_Datesheet_18102021

CBSE క్లాస్ 12 టైం టేబుల్​ - హ్యుమానిటీస్ స్ట్రీమ్

డిసెంబర్ 1 - సామాజిక శాస్త్రం

డిసెంబర్ 3 - ఇంగ్లీష్ కోర్

డిసెంబర్ 7 - శారీరక విద్య

డిసెంబర్ 9 - భౌగోళికం

డిసెంబర్ 11 -సైకాలజీ

డిసెంబర్ 15 - ఆర్థిక శాస్త్రం

డిసెంబర్ 17 - రాజకీయ శాస్త్రం

డిసెంబర్ 20 - చరిత్ర

12th date sheet


12 వ తరగతికి డిసెంబర్​ 22న  టర్మ్​ 1 పరీక్షలు ముగుస్తాయి.

First published:

Tags: CBSE, CBSE Board Exams 2021, Exams

ఉత్తమ కథలు