మే 2న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చిన సీబీఎస్ఈ... 10వ తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు మే 5న రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. విద్యార్థులు మే 5న cbseresults.nic.in, cbse.nic.in వెబ్సైట్లల్లో ఫలితాలు చూడొచ్చు. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.
సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను చెక్ చేసుకోండి ఇలా...
ముందుగా సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ www.cbseresults.nic.in ఓపెన్ చేయండి.
10వ తరగతి ఫలితాల లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయండి.
మీ రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి.
ఫలితాలను ప్రింట్ అవుట్ తీసుకొని రిఫరెన్స్ కోసం పెట్టుకోవడం మంచిది.
సీబీఎస్ఈ 10వ తరగతి విద్యార్థుల సంఖ్య 18,27,472. వారంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. 2018లో సీబీఎస్ఈ 10వ తరగతిలో 86.70 మంది విద్యార్థులు పాసయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.