హోమ్ /వార్తలు /jobs /

CBSE Term 2 Exams: ఏప్రిల్ 26 నుంచి సీబీఎస్ఈ టర్మ్ 2 ఎగ్జామ్స్.. డేట్ షీట్ విడుదల.. వివరాలివే

CBSE Term 2 Exams: ఏప్రిల్ 26 నుంచి సీబీఎస్ఈ టర్మ్ 2 ఎగ్జామ్స్.. డేట్ షీట్ విడుదల.. వివరాలివే

 ఏప్రిల్ 26 నుంచి సీబీఎస్ఈ టర్మ్ 2 ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సీబీఎస్ఈ డేట్ షీట్ విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) తాజాగా కీలక ప్రకటన చేసింది. 10, 12వ తరగతుల టర్మ్ 2 ఎగ్జామ్స్ కు సంబంధించిన డేట్ షీట్లను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్స్ ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపింది. క్లాస్ 10 పరీక్షలు మే 24న ముగియనుండగా.. క్లాస్ 12 ఎగ్జామ్స్ జూన్ 15న ముగియనున్నాయి. ఈ ఎగ్జామ్స్ ను 26 దేశాల్లో నిర్వహించనుంది సీబీఎస్ఈ. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉదయం 10.30 గంటలకు ఎగ్జామ్స్ ను ప్రారంభించనుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా పరీక్షల తేదీల మధ్య గ్యాప్ పెంచారు అధికారులు.

    2021-2022 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ పరీక్షలను రెండు టర్మ్ ల్లో నిర్వహించాలని నిర్ణయించింది. అనేక రాష్ట్రాలకు చెందిన బోర్డులు సైతం సీబీఎస్ఈ బాటలో వెళ్లి రెండు టర్మ్ లలో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించాయి, చాలా రాష్ట్రాల విద్యా బోర్డులు కూడా అదే నిర్ణయాన్ని అమలు చేస్తున్నాయి.

    సీబీఎస్ఈ 10, 12వ తరగతులకు డేటా షీట్ అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in , cbsecademic.nic.inలో విడుదల చేశారు అధికారులు. సీబీఎస్ఈ అడ్మిట్ కార్డులను అభ్యర్థుల వారి స్కూల్స్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.

    First published:

    ఉత్తమ కథలు