CBSE CLASS 10 12 BOARD EXAMS WILL HAPPEN FOR SURE SCHEDULE TO BE ANNOUNCED SOON NS
CBSE Exams: ఆ పరీక్షలు రద్దయ్యే ఛాన్సే లేదు.. సీబీఎస్ఈ సెక్రటరీ కీలక ప్రకటన
ప్రతీకాత్మక చిత్రం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) బోర్డు సెక్రటరీ అనురాగ్ తిరుపతి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. తమ బోర్డు పది, 12వ తరగతి పరీక్షలను తప్పకుండా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.
కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం అనేక రాష్ట్రాల్లో ఇంకా పాఠశాలలు ప్రారంభం కాలేదు. సాధ్యమైనంత మేరకు ఆన్లైన్లోనే విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు. తరగతులు జరుగుతున్నాయి కానీ ఈ సంవత్సరం ఫైనల్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారన్న అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాప్తి ఇలానే కొనసాగితే గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా పరీక్షలు రద్దు అవుతాయనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) బోర్డు సెక్రటరీ అనురాగ్ తిరుపతి శుక్రవారం కీలక ప్రకటన చేశారు.
తమ బోర్డు పది, 12వ తరగతి పరీక్షలను తప్పకుండా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. అయితే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను తర్వాత విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. పరీక్షలు గతేడాది ఫార్మాట్ లోనే ఉంటాయా? లేదా? అన్న అంశంపై సైతం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. పరీక్షలు ఫిబ్రవరి, మార్చిలోనే ఉంటాయా లేక ఆలస్యంగా నిర్వహిస్తారా అన్న అంశంపై ఇంకా సీబీఎస్ఈ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. వివిధ టెక్నాలజీలను ఉపయోగించుకుని విద్యార్థులకు పాఠాలు బోధించేలా టీచర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తిరుపతి తెలిపారు.
తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్ల తేదీని మరో సారి పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16తో ఇంటర్ ప్రవేశాల గడువు ముగిసింది. అయితే తాజాగా ఈ నెల 30 వరకు అడ్మిషన్లు గడువును పొడిగిస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ అంటర్ లో అడ్మిషన్లు కల్పించాలన్న లక్ష్యంతో ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.