హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE: సీబీఎస్​ఈ 10, 12 పరీక్షల్లో సమూల మార్పులు.. కొత్త ప్యాటర్న్​ ఏంటి? ఎలా ప్రిపేర్ అవ్వాలి?

CBSE: సీబీఎస్​ఈ 10, 12 పరీక్షల్లో సమూల మార్పులు.. కొత్త ప్యాటర్న్​ ఏంటి? ఎలా ప్రిపేర్ అవ్వాలి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CBSE: 2022 సంవత్సరం నుంచి సీబీఎస్సీ బోర్డ్ పరీక్షలు ఏటా రెండుసార్లు జరగనున్నాయి. మొత్తం రెండు టర్మ్‌లలో పరీక్షలు జరగనుండగా.. టర్మ్ -1 పరీక్షలను నవంబర్‌లో నిర్వహించనున్నారు. టర్మ్​ 2 మార్చి లేదా ఏప్రిల్​లో జరగనుంది.

విద్యా విధానం (Education Policy)లో పెను మార్పులు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఎన్నో సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్​ఈ (CBSE) 10, 12వ తరగతిలో సెమిస్టర్ (Semester)​ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంటే, 2022 సంవత్సరం నుంచి సీబీఎస్సీ బోర్డ్ పరీక్షలు ఏటా రెండుసార్లు జరగనున్నాయి. మొత్తం రెండు టర్మ్‌లలో పరీక్షలు జరగనుండగా.. టర్మ్ -1 పరీక్షలను నవంబర్‌లో నిర్వహించనున్నారు. టర్మ్​ 2 మార్చి లేదా ఏప్రిల్​లో జరగనుంది. మొదటి టర్మ్‌ పరీక్షలు 50% సిలబస్​పై ఉంటాయి. రెండో టర్మ్​ మిగిలిన 50 శాతం సిలబస్​పై ఉంటుంది. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కులు, ఇంటర్నల్​ అసెస్​మెంట్​ మార్కులను కలిపి ఫైనల్​ స్కోర్​ (Final Score) నిర్ణయిస్తారు.

Skill India: 10th పాస్ అయ్యారా..నేషనల్‌ అప్రెంటీస్‌షిప్‌ మేళాతో జాబ్ గ్యారంటీ..

అయితే ఇంటర్నల్​ అసెస్​మెంట్​ (Internal Assessment)కు గతంలో కంటే ఎక్కువ మార్కులు కేటాయించారు. బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ కొత్త ఎగ్జామ్ ప్యాటర్న్ (New exam pattern) ​పై అవగాహన పెంచుకోవాలి. ఈ కొత్త విధానంపై ఢిల్లీ పబ్లిక్​ స్కూల్​ (Delhi Public School)- ఇందిరాపురం ప్రిన్సిపాల్ సంగీత హజేలా మాట్లాడుతూ "2022 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్​ఈ పరీక్షల్లో కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ కొత్త విధానంలో ఎస్సే క్వశ్చన్స్​ కంటే ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలను ఎక్కువగా అడుగుతారు. దీనిలో ఎటువంటి ఛాయిస్​ ఉండదు కనుక, విద్యార్థులు ప్రతి ఛాప్టర్​ను చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రశ్నను అర్థం చేసుకోని సరైన ఆప్షన్​ను ఎంచుకోవడంపై దృష్టి పెట్టాలి" అని చెప్పారు.

IBPS Clerk : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. తెలుగులో ఐబీపీఎస్ క్ల‌ర్క్ ప‌రీక్ష‌

ఎగ్జామ్​ ప్యాటర్న్​ ఎలా ఉంటుంది?

టర్మ్-1లో కేస్-బేస్డ్ MCQ ప్రశ్నలుంటాయి. అసర్షన్​ -రీజనింగ్ టైప్ MCQ లు, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వస్తాయి. ఈ పరీక్షల్లో ప్రతి పేపర్​కు 90 నిమిషాల సమయం కేటాయించారు. టర్మ్ II లో కేస్-బేస్డ్, సిచ్యుయేషన్- బేస్డ్, ఓపెన్-ఎండ్ ప్రశ్నలతో సహా షార్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు, వివిధ ఫార్మాట్లలో ప్రశ్నలు ఉంటాయి. టర్మ్ IIలో ప్రతి సబ్జెక్ట్​ పేపర్​కు 2 గంటల సమయం కేటాయించారు. విద్యార్థుల సమాధానాలు OMR షీట్లలో భద్రపరిచి, స్కానింగ్ చేసి.. తర్వాత నేరుగా సీబీఎస్ఈ పోర్టల్​లో అప్​లోడ్​ చేస్తారు. లేదంటే ప్రత్యామ్నాయంగా మూల్యాంకనం చేస్తారు. అనంతరం ఆయా పాఠశాలలు తమ విద్యార్థులు సాధించిన మార్కులను అదే రోజు అప్​లోడ్ చేస్తాయి.

First published:

Tags: CBSE, CBSE Board Exams 2021, EDUCATION, Study

ఉత్తమ కథలు