హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Two Exam Policy: సీబీఎస్​ఈ విద్యార్థులకు అలర్ట్.. కొత్త ఎగ్జామ్ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలివే.. తెలుసుకోండి

CBSE Two Exam Policy: సీబీఎస్​ఈ విద్యార్థులకు అలర్ట్.. కొత్త ఎగ్జామ్ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలివే.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీబీఎస్​ఈ కొత్త పరీక్షల విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించింది. 10వ, 12వ తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షలు ఏడాదిలో రెండుసార్లు నిర్వహించే టూ ఎగ్జామ్ పాలసీని ఇటీవల సీబీఎస్ఈ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాలసీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

సెంట్రల్ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ (సీబీఎస్​ఈ) కొత్త పరీక్షల విధానాన్ని తీసుకొచ్చింది. 10వ, 12వ తరగతుల విద్యార్థులకు బోర్డు పరీక్షలు ఏడాదిలో రెండుసార్లు నిర్వహించే టూ ఎగ్జామ్ పాలసీని ప్రకటించింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. ప్రస్తుత 2021-22 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలులోకి తేనున్నట్టు ప్రకటించింది. మరోవైపు ఒకే సంవత్సరంలో రెండుసార్లు పరీక్షలంటే ఒత్తిడి మరింత పెరుగుతుందని, కొత్త పరీక్షల విధానం సరికాదని కొందరు విద్యార్థులు భావిస్తున్నారు. పరీక్షల ఫలితాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు. కరోనా ప్రభావంతో 2020-21 విద్యాసంవత్సరంలో పరీక్షలు రద్దు చేయాల్సి రావడంతో సీబీఎస్​ఈ నూతన విధానానికి రూపకల్పన చేసింది. కొత్త పాలసీ కింద 10, 12వ తరగతులకు బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించనుంది.

JEE Main 2021 Exam Date: జేఈఈ మెయిన్ విద్యార్థులకు అలర్ట్... పరీక్ష తేదీలు ప్రకటించిన కేంద్ర మంత్రి

“రెండు పరీక్షలకు సంబంధించి సిలబస్​ను విభజిస్తాం. ఈ వివరాలను ఈ ఏడాది జూలై నాటికి అన్ని స్కూల్స్​కు తెలియజేస్తాం. బోర్డు పరీక్షల పేపర్ విధానం మారుతుంది. అబ్జెక్టివ్ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్లను తగ్గిస్తాం” అని సీబీఎస్​ఈ ప్రకటించింది.

పరీక్షలెప్పుడు..?

2021-22 విద్యాసంవత్సరంలో రెండుసార్లు నిర్వహించాలనుకున్న పరీక్షల షెడ్యూల్​ను సీబీఎస్​ఈ ఇంకా ప్రకటించలేదు. అయితే కరోనా వైరస్ అదుపులో ఉంటే ఏ నెలల్లో నిర్వహించాలనేది నిర్ణయం తీసుకుంది. సీబీఎస్​ఈ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మొదటి టర్మ్​ పరీక్షలు 2021 నవంబర్​-డిసెంబర్​లో, రెండో టర్మ్​ పరీక్షలు 2022 మార్చి- ఏప్రిల్​లో జరుగుతాయి. దేశంలోని, విదేశాల్లోని అన్ని సీబీఎస్​ఈ స్కూళ్లకు ఇది వర్తిస్తుంది. రానున్న విద్యా సంవత్సరంలో ప్రతీ బోర్డు ఎగ్జామ్​లో 50 శాతం సిలబస్​పై ప్రశ్నలు ఉంటాయని సీబీఎస్​ఈ చెప్పింది. త్వరలోనే ఇందుకు సంబంధించి సిలబస్​ను రెండు పరీక్షల కోసం విభజిస్తామని చెప్పింది.

“మొదటి టర్మ్​ పరీక్షల్లో ఒక్కో టెస్టుకు విద్యార్థులకు 90 నిమిషాల సమయం ఉంటుంది. అన్ని సూళ్లకు క్వశ్చన్ పేపర్లు, మార్కుల విధానాన్ని సీబీఎస్​ఈ పంపుతుంది. ఎగ్జామ్​లో మల్టిపుల్​ చాయిస్​ క్వశ్చన్లు కూడా ఉంటాయి” అని సీబీఎస్​ఈ అకడమిక్ డైరెక్టర్​ జోసెఫ్ ఇమ్మాన్యుయేల్​ తెలిపారు. ఎక్స్​టర్నల్ సూపరింటెండెంట్లు, సీబీఎస్​ఈ నియమించే అబ్జర్వర్ల సమక్షంలో పరీక్షలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. రెండో టర్మ్​ పరీక్షలు కూడా విభజించిన సిలబస్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు. కొత్త పరీక్షల విధానాన్ని ప్రకటించే ముందు ప్రభుత్వం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సంప్రదించినట్టు సీబీఎస్​ఈ చెప్పింది. అలాగే కరోనా పరిస్థితులను, ఆఫ్​లైన్ టీచింగ్ కొరతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామంది.

First published:

Tags: CBSE, CBSE Board Exams 2021, Exams

ఉత్తమ కథలు