కరోనా(Corona) సమయంలో విద్యా రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అవసరాల మేరకు పరీక్షల షెడ్యూల్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ వంటి వాటిని సవరించారు. ఇప్పుడు పరిస్థితులు చక్క పడటంతో విద్యారంగం సాధారణ స్థితికి చేరుకుంది. సీబీఎస్ఈ(CBSE), సీఐఎస్సీఈ 10, 12వ తరగతి పరీక్షల కోసం విద్యార్థులు ప్రిపరేషన్ మొదలుపెట్టారు. పరీక్షలకు ఇక కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. పరీక్షల షెడ్యూల్ (Exam Schedule) కోసం విద్యార్థులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రెండు బోర్డులు 10, 12వ తరగతి పరీక్షల 2023 షెడ్యూల్‌ను నవంబర్ 30 నాటికి వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.
* ఫిబ్రవరి- మార్చి మధ్యలో పరీక్షలు
సాధారణంగా పరీక్షల షెడ్యూల్(డేట్ షీట్)ను పరీక్షలకు 45 రోజుల ముందు ప్రకటిస్తారు. అయితే ఈసారి ఈ విధానానికి స్వస్తి పలికే సూచనలు కనిపిస్తున్నాయి. కొంచెం ముందుగానే డేట్ షీట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐఎస్సీ బోర్డుల పరీక్షలు ఫిబ్రవరిలో మొదలై, మార్చి వరకు జరగనున్నాయి. సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన తరువాత అధికారిక వెబ్సైట్లు cbse.nic.in లేదా cbse.gov.inలో అందుబాటులో ఉంటుంది. CISCE డేట్‌షీట్‌ను cisce.org వెబ్సైట్లో చూడవచ్చు. రెండు బోర్డులు గత సంవత్సరం తరహాలో పరీక్షను రెండు భాగాలుగా కాకుండా ఒకసారి మాత్రమే నిర్వహించనున్నాయి.
* సిలబస్‌లో మార్పులు
ఐసీఎస్ఈ, ఐఎస్సీ పరీక్షలకు సంబంధించి ఎంపిక చేసిన కొన్ని సబ్జెక్టుల్లో ఈసారి సిలబస్‌ను సవరించారు. సీబీఎస్ఈ కూడా సిలబస్ విషయంలో చాలా మార్పులు చేసింది. కరోనా కారణంగా గత రెండేళ్లలో సిలబస్‌ను తగ్గించింది. అయితే ఈసారి పూర్తిస్థాయి సిలబస్‌తో పరీక్షలను నిర్వహించనుంది. విద్యార్థుల్లో పోటీత్వతం పెరగటానికి మరిన్ని అంతర్గత ఛాయిస్‌లతో పరీక్ష ప్యాట్రన్‌లో కూడా మార్పులు చేస్తున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది.
* ప్రతి సబ్జెక్ట్ 80 మార్కులకు.. ప్రాక్టికల్స్‌కు 20
సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 2023 బోర్డ్ పరీక్షలు ప్రతి సబ్జెక్ట్ 80 మార్కులకు ఉంటుంది. మిగిలిన 20 మార్కులను ఇంటర్నల్ అసెస్మెంట్స్ లేదా ప్రాక్టికల్స్‌కు కేటాయిస్తారు. రెండు బోర్డులు ఇప్పటికే శాంపుల్ పేపర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులు ఎగ్జామ్‌లో 5 సబ్జెక్టుల్లో పాస్ కావాలంటే కనీసంగా 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ 10వ తరగతిలో 40 శాతం కాంపిటెన్సీ బేస్డ్ ప్రశ్నలు వచ్చే అవకాశముండగా, 12వ తరగతిలో 30 శాతం ఈ తరహా ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్రం సీబీఎస్ఈ 10, 12వ తరగతుల ఎగ్జామ్ ప్యాట్రన్‌లో మార్పులు చేసింది.
* జనవరి 1 నుంచి ప్రాక్టికల్స్
2022-23 సెషన్‌కు సంబంధించి సీబీఎస్ఈ ప్రాక్టికల్ పరీక్షలు, ప్రాజెక్ట్ లేదా ఇంటర్నల్ అసెస్మెంట్ జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి ఇంటర్నల్ అసెస్మెంట్కు గతంలో కంటే కూడా ఎక్కువ మార్కులను కేటాయించారు. వింటర్- బౌండ్ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలు శీతాకాలం కారణంగా జనవరి నెలలో క్లోజ్ చేయనున్నారు. దీంతో ఈ పాఠశాలల్లో ప్రాక్టికల్స్‌ను ముందుగానే నిర్వహించే అవకాశం ఉంది. వింటర్ బౌండ్ ప్రాంతాల్లో ఉన్న స్కూలల్లో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు ప్రాక్టికల్స్ సెషన్ ఉండనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, CBSE, JOBS, Students