CBSE CISCE CLASS 10 12 TERM 2 EXAMS EXPECTED EXAM DATES AND PAPER PATTERN GH VB
CBSE, CISCE Exams: 10, 12 తరగతుల టర్మ్ 2 పరీక్షలు ఎప్పుడు..? పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది..? తెలుసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
భారతదేశంలో కరోనా (Corona) ఉద్ధృతి నేపథ్యంలో ఎగ్జామ్ తేదీలను (exam dates) ఖరారు చేయడానికి అనేక పరీక్షల నిర్వహణ బోర్డులు వెనకాడుతున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), కౌన్సిల్ ఫర్ ది ఇండియా స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) బోర్డులు టర్మ్ 2 పరీక్షల (term 2 exams) తేదీలను ఇప్పటివరకు విడుదల చేయలేదు.
భారతదేశంలో కరోనా (Corona) ఉద్ధృతి నేపథ్యంలో ఎగ్జామ్ తేదీలను (exam dates) ఖరారు చేయడానికి అనేక పరీక్షల నిర్వహణ బోర్డులు వెనకాడుతున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), కౌన్సిల్ ఫర్ ది ఇండియా స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) బోర్డులు టర్మ్ 2 పరీక్షల (term 2 exams) తేదీలను ఇప్పటివరకు విడుదల చేయలేదు. అయితే కరోనా మహమ్మారి పూర్తి నియంత్రణలోకి వస్తే.. 10, 12వ తరగతి టర్మ్ 2 పరీక్షలను మార్చి లేదా ఏప్రిల్ నెలలో సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ బోర్డులు నిర్వహించవచ్చని తెలుస్తోంది.ప్రస్తుతానికైతే, 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన సెకండ్ టర్మ్ పరీక్షల తేదీలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ బోర్డుల టర్మ్ 2 పరీక్ష విధానం (exam pattern) గురించి కూడా విద్యార్థులు పూర్తిస్థాయిలో తెలుసుకోలేదు. ఈ తరుణంలో విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం, పరీక్షల ఏ తేదీల్లో నిర్వహిస్తారు? పరీక్షల సరళి ఎలా ఉండనుంది? వంటి విషయాలు తెలుసుకుందాం.
CBSE టర్మ్ 2: పరీక్ష తేదీలు, పరీక్ష పేపర్ ప్యాటర్న్
లక్షలాది రోజువారీ పాజిటివ్ కేసులతో కోవిడ్-19 పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగానే ఉంది. అయితే ఈ పరిస్థితిని సమీక్షించిన తర్వాత సీబీఎస్ఈ రెండో టర్మ్ పరీక్షలకు సంబంధించిన అప్డేట్ను ప్రకటిస్తుంది. సీబీఎస్ఈ టర్మ్ 2 తేదీ షీట్ విడుదలైన తర్వాత, విద్యార్థులు అధికారిక వెబ్సైట్ అయిన cbse.gov.in లో తేదీ షీట్‌ను చెక్ చేసుకోవచ్చు. సీబీఎస్ఈ 10, 12వ తరగతుల టర్మ్ 1 రిజల్ట్స్ రిలీజ్ అయ్యాక టర్మ్ 2 పరీక్షల డేట్‌షీట్ విడుదల కావచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.
సీబీఎస్ఈ బోర్డు ప్రకారం, టర్మ్ 2 పరీక్షలలో షార్ట్, లాంగ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి.
టర్మ్ 2 క్వశ్చన్ పేపర్ లో కొన్ని ఇంటర్నల్ ఛాయిసెస్ లతోపాటు సబ్జెక్టివ్, కేస్ బేస్డ్ క్వశ్చన్లు ఉంటాయి. ఈ పరీక్ష రెండు గంటల పాటు జరగనుంది. సీబీఎస్ఈ బోర్డు తన అధికారిక వెబ్సైట్ అయిన cbseacademic.nic.inలో టర్మ్ 2 శాంపిల్ పేపర్స్ కూడా విడుదల చేసింది. ఈ వెబ్సైట్ నుంచి విద్యార్థులు శాంపిల్ పేపర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
CBSE సెమిస్టర్ 2 : పరీక్ష తేదీలు, పరీక్ష పేపర్ ప్యాటర్న్
సీఐఎస్సీఈ బోర్డు ఫిబ్రవరి నాటికి 12, 10వ తరగతుల సెకండ్ సెమిస్టర్ డేట్ షీట్‌ను లేదా పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేయాలని భావిస్తోంది. సెమిస్టర్ 2 పరీక్షలు మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెమిస్టర్ 1 రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత సెమిస్టర్ 2 పరీక్షపై బోర్డు అప్డేట్ చేస్తుందని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. సీఐఎస్సీఈ రెండు పరీక్షల కోసం పరీక్షా సరళిని మార్చింది. సెమిస్టర్ 1 పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు ఐసీఎస్ఈకి 80/100 మార్కులకు, ఐఎస్‌సీకి 70/80 మార్కులకు ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా సిలబస్ తగ్గించడం జరిగింది. ప్రస్తుత పరిస్థితిని బట్టి సెమిస్టర్ 2 ఆన్లైన్ మోడ్‌లో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.