సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) అండ్ కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) 2022 బోర్డు పరీక్షలను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను నవంబర్ 15, 2021న సోమవారం సుప్రీంకోర్టు (Supreme Court) విచారించనుంది. ఆరుగురు విద్యార్థుల బృందం రెండు సెంట్రల్ బోర్డులకు ఆన్లైన్ అండ్ ఆఫ్‌లైన్ మోడ్‌లో టర్మ్ 1 బోర్డ్ పరీక్షలను నిర్వహించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.న్యాయవాది సుమంత్ నూకల దాఖలు చేసిన పిటిషన్లో, దేశంలో మళ్లీ కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరిగినందున, విద్యార్థులు ఆన్లైన్ మోడ్‌లో పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించాలని పేర్కొన్నారు.
CISCE గతంలో విద్యార్థులకు ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్ (Online) మోడ్‌లో టర్మ్ 1 బోర్డ్ ఎగ్జామ్స్ 2022లో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చింది. అయితే తర్వాత నిర్ణయాన్ని వాయిదా వేసింది. పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో మాత్రమే నిర్వహించేలా సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
IBPS Exams: ఐబీపీఎస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా..? అయితే టిప్స్ పాటించండి
ప్రస్తుతం బోర్డు పరీక్షలు ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రధాన సబ్జెక్టుల కోసం CBSE 10వ తరగతి పరీక్షలు నవంబర్ 3, 2021 నుంచి ప్రారంభం కాగా, 12వ పరీక్షలు డిసెంబర్ 1, 2021 నుంచి ప్రారంభం కానున్నాయి. ICSE పరీక్షలు నవంబర్ 29, 2021 నుంచి ISC నవంబర్ చివరి వారంలో జరుగుతాయి. అయితే, మైనర్ సబ్జెక్టులకు సంబంధించి సీబీఎస్ఈ పరీక్షలు నవంబర్ 16వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు ముందకు ఈ పిటిషన్ వచ్చింది.
ఆరోగ్య హక్కును ఉల్లంఘించడమే..
ఆఫ్‌లైన్ మోడ్‌లో పరీక్షల నిర్వహణ ప్రస్తుత పరిస్థితుల్లో సరైన నిర్ణయం కాదని పిటిషనర్ పేర్కొన్నారు. ర్డులు చెప్పిన తేదీల్లో పరీక్షలను నిర్వహించాలనుకున్నప్పటికీ, దానిని జాగ్రత్తగా ప్లాన్ చేయడానికి .. ప్రస్తుత పిటిషన్లో లేవనెత్తిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవడానికి తగిన సమయం.. వనరులు ఉన్నాయని పిటిషనర్లు తెలిపారు. ప్రస్తుతం ఇది “సూపర్ స్ప్రెడర్” ఈవెంట్ అని విద్యార్థులు (Students) పేర్కొన్నారు.
Internship: ఫ్రెషర్స్, కాలేజ్ స్టూడెంట్స్ కోసం టాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ వివరాలు
“ఏదైనా సరే, ఆఫ్‌లైన్ పరీక్షల ద్వారా ఇటువంటి నిరంతర బహిర్గతం కోవిడ్ 19కి ఇన్ఫెక్షన్ (Infection) ప్రమాదాన్ని తీవ్రంగా పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏకపక్ష నిర్ణయం ఆరోగ్య హక్కును ఉల్లంఘించేలా చేస్తుందని అభిప్రాయ పడ్డారు.
ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది పిల్లలు తమ డిమాండ్లను చెప్పడానికి సోషల్ మీడియాను వేదిక చేసుకొంటున్నారు. పెరుగుతున్న COVID-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించదం సరికాదని అంటున్ఆనరు. ఇందు కోసం #MakeTerm1Online , #MakeTerm1Hybrid అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th Class Exams, CBSE, CBSE Board Exams 2021, Exams