కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ అమలులో ఉండటంతో... పదో తరగతి పరీక్షల విషయంలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ విషయంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెండింగ్లో ఉన్న టెన్త్ పరీక్షలను రద్దు చేసే యోచనలో సీబీఎస్ఈ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్న సబ్జెక్టులకు పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై బోర్డు కసరత్తు చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితిని నిశితంగా పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని సీబీఎస్ఈ అధికారులు పేర్కొన్నారు.
కొద్దిరోజుల క్రితం పది, పన్నెండో తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తారని వచ్చిన వార్తలను సీబీఎస్ఈ ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ సర్కార్ మాత్రం లాక్ డౌన్ ముగిసిన రెండు వారాల తరువాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.