CBSE 12th Board Exams 2021: సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు రద్దు అవుతాయంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన బోర్డు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గని ఈ పరిస్థితుల్లో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు కూడా రద్దు అవుతాయంటూ వస్తున్న వార్తలపై సీబీఎస్ఈ బోర్డు స్పందించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కేంద్రం సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మే 4న ప్రారంభమై జూన్ 14న ముగియాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేసిన అధికారులు కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే దేశంలో కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గకపోవడంతో సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్షలు రద్దు చేయనున్నారంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలతో పాటు, సోషల్ మీడియాలోనూ ఈ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు స్పందించింది. పరీక్షలు రద్దు అవుతాయంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని బోర్డు అధికారులు తేల్చిచెప్పారు. ఇప్పటివరకు అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేశారు. తాము ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అధికారికంగా ప్రకటిస్తామని వారు తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు సమాచారం కోసం సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని వారు సూచించారు.
    Tenth Exams: టెన్త్ విద్యార్థులకు ఆ విషయంలో షాక్.. అధికారుల కీలక నిర్ణయం.. వివరాలివే
    EAMCET 2021: కరోనా ఎఫెక్ట్.. ఎంసెట్ దరఖాస్తుల విషయంలో అధికారుల కీలక నిర్ణయం?

    పరీక్షలు రద్దు చేయాల్సిందే..
    ఇదిలా ఉంటే దేశంలో కరోనా కేసుల నమోదు ఏ మాత్రం తగ్గని ఈ సమయంలో సీబీఎస్ఈ 12 క్లాస్ పరీక్షలను రద్దు చేయాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రభుత్వానికి తమ వినతిని తెలియజేస్తున్నారు. మమత శర్మ అనే లాయర్ సైతం పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ విషయంపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అంశం ఉత్కంఠ కలిగిస్తోంది.

    కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలోనూ టెన్త్ ఎగ్జామ్స్ ను ప్రభుత్వం రద్దు చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసింది సర్కార్. అయితే ఇంటర్ సెకండియర్ పరీక్షలను మాత్రం వాయిదా వేసింది. జూన్ మొదటి వారంలో ఈ పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని సర్కార్ స్పష్టం చేసింది. అయితే కేసులు, మరణాల సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవడం, థార్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షల నిర్వహణ సాధ్యం కాదన్న వార్తలు వస్తున్నాయి. సెకండియర్ పరీక్షల రద్దుకే అధికారులు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ రానుంది.
    Published by:Nikhil Kumar S
    First published: