CBSE Board Exams: సీబీఎస్​ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో టర్మ్-1 పరీక్షలే కీలకం.. ఎందుకంటే?

ప్రతీకాత్మక చిత్రం

త్వరలో 2021-22 సెషన్ కోసం సీబీఎస్సీ బోర్డు(CBSE Board) రెండు టర్ములుగా పరీక్షలను (CBSE Exams) నిర్వహించనుంది. ఫలితంగా చాలా మంది విద్యార్థుల్లో వీటిపై భయం పట్టుకుంది. అయితే..

  • Share this:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (CBSE) పరీక్షలంటేనే (Exams) విద్యార్థుల్లో గుండెల్లో గుబులు మొదలవుతుంది. ముఖ్యంగా 10, 12వ తరగతి పరీక్షల (CBSE 10, 12th Exams) కోసం తెగ కుస్తీ పడుతుంటారు. త్వరలో 2021-22 సెషన్ కోసం సీబీఎస్సీ బోర్డు (CBSE Board) రెండు టర్ములుగా పరీక్షలను నిర్వహించనుంది. ఫలితంగా చాలా మంది విద్యార్థుల్లో వీటిపై భయం (Exam Fear) పట్టుకుంది. అయితే సీబీఎస్సీ రిజల్ట్స్ (CBSE Results) కూడా రెండు టర్మ్ ల స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటుంది. కరోనా (Corona) మహమ్మారి కారణంగా టర్మ్-2 పరీక్షలు (CBSE Term 2 Exams) నిర్వహించనట్లయితే టర్మ్-1 రిజల్ట్స్ (CBSE Term 1 Results) ను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది.

తుది ఫలితాల ఆధారంగానే మెరిట్..
మొదటి టర్మ్ లో సిలబస్ 50 శాతం కవర్ చేస్తారు. 10, 12వ తరగతులకు కూడా సిలబస్ ను 30 శాతానికి తగ్గించి దీనికి అనుగుణంగా ఎగ్జామ్ ప్యాట్రన్ ను సవరించారు. ఇంటర్నల్ అసెస్మెంట్ల పరంగానూ 10వ తరగతి పరీక్షలు మూడు పీరియడిక్ టెస్టులు, స్టూడెంట్ ఎన్రిచ్మెంట్(student enrichment), పోర్ట్ ఫోలియో, ప్రాక్టికల్ వర్క్, స్పీకింగ్ లిజనింగ్ యాక్టివిటీల ప్రకారం ఉంటాయి.

CBSE Board Exams 2022 : విద్యార్థుల‌కు సీబీఎస్ఈ ప్ర‌త్యేక అవ‌కాశం.. ప‌రీక్ష కేంద్రాన్ని ఎంచుకోవ‌చ్చు

12వ తరగతి ఇంటర్నల్లో ప్రతి టాపిక్ చివర యూనిట్ పరీక్షలు, అన్వేషాత్మక యాక్టివిటీస్ (Exploratory Activities), ప్రాక్టికల్స్, ప్రాజెక్టులు ఉంటాయి. టర్మ్-1 పరీక్షల ఫలితాలు మార్కులను మాత్రమే కలిగి ఉంటాయి. విద్యార్థిని పాస్ లేదా ఫెయిల్ కేటగిరీలో ఉంచరు. తుది ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే మెరిట్ జాబితా రూపొందిస్తారు.

Telangana Inter Exams : ప‌రీక్ష‌లంటే భ‌య‌మా.. అయితే కాల్ చేయండి : క్లినిక‌ల్ సైకాల‌జిస్టు ప్యాన‌ల్‌ ప్ర‌వేశ‌పెట్టిన ఇంట‌ర్ బోర్డు

పరీక్షల తేదీలు..
CBSE ఇప్పటికే మేజర్, మైనర్ సబ్జెక్టుల కోసం డేట్ షీట్ (CBSE Exams Date Sheet) ను విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలు నవంబరు 30 నుంచి, 12వ తరగతి పరీక్షలు డిసెంబరు 1 నుంచి ప్రారంభం కానున్నాయి. మైనర్ సబ్జెక్టులు అంతకు ముందుగానే పూర్తవుతాయి. టర్మ్-1 పరీక్షలు కేస్ బేస్డ్, అసెర్షన్-రీజనింగ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు కలిగి ఉంటాయి. విద్యార్థులు తమ సమాధానాలను ఓఎంఆర్ షీట్ పై గుర్తు పెట్టాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్ కు 90 నిమిషాల సమయం ఉంటుంది.
CBSE date sheet 2022: సీబీఎస్​ఈ పరీక్షల టైం టేబుల్ విడుదల.. పరీక్షలు తేదీలు ఇక్కడ తెలుసుకోండి

ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు..
సీబీఎస్సీ 12వ తరగతిలో మొత్తం 114 సబ్జెక్టులుంటే, 10వ తరగతిలో 75 సబ్జెక్టులు ఉంటాయి. వీటిలో 19 సబ్జెక్టులు 12, 10, 9వ తరగతిలో వచ్చే మేజర్ సబ్జెక్టులు కాగా.. మిగిలినవి మైనర్ సబ్జెక్టులు. టర్మ్-1 బోర్డు పరీక్షల కోసం విద్యార్థులు వారు నమోదు చేసుకున్న పాఠశాలల నుంచి హాజరుకావడానికి వీలుంటుంది. కాబట్టి వారు కరోనా సమయంలో ఎక్కువ దూరం ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉండదు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేలా సీబీఎస్సీ పరీక్షా కేంద్రాల వద్ద అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లను నియమిస్తుంది.
Published by:Nikhil Kumar S
First published: