Home /News /jobs /

CBSE Board Exams: బోర్డు పరీక్షల్లో మార్పులు చేసిన సీబీఎస్‌ఈ.. ఇక నుంచి రెండు టర్మ్‌లు.. పూర్తి వివరాలు ఇవే..

CBSE Board Exams: బోర్డు పరీక్షల్లో మార్పులు చేసిన సీబీఎస్‌ఈ.. ఇక నుంచి రెండు టర్మ్‌లు.. పూర్తి వివరాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డ్ పరీక్ష సరళిని పూర్తిగా మార్చేసింది. సీబీఎస్‌ఈ బోర్డు 2022లో రెండు బోర్డు పరీక్షలను రెండు టర్మ్‌లుగా విభజించి నిర్వహించనుంది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డ్ పరీక్ష సరళిని పూర్తిగా మార్చేసింది. సీబీఎస్‌ఈ బోర్డు 2022లో రెండు బోర్డు పరీక్షలను రెండు టర్మ్‌లుగా విభజించి నిర్వహించనుంది. పరీక్ష సరళి మరింత పారదర్శకంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు వివరించింది. భవిష్యత్తులో ఎదురయ్యే విభిన్న పరిస్థితులకు అనుగుణంగా బోర్డు పరీక్షలను మార్చేశామని సీబీఎస్ఈ తెలిపింది. ప్రతి టర్మ్‌లో 50 శాతం సిలబస్ ఉంటుంది. టర్మ్ I నవంబర్-డిసెంబర్‌లో జరగనుండగా, టర్మ్ II మార్చి-ఏప్రిల్‌లో జరగనుంది. ప్రతి టర్మ్‌కు పరీక్ష(Term Exam) పద్ధతిని కూడా బోర్డు మార్చేసింది.

టర్మ్‌ I లో కేస్-బేస్డ్ MCQ లు, అసర్షన్-రీజనింగ్ టైప్ MCQ లు, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షా పేపర్(Exam Paper) సమయం 90 నిమిషాలు. టర్మ్‌ II లో కేస్-బేస్డ్, సిచ్యుయేషన్-బేస్డ్, ఓపెన్-ఎండ్ ప్రశ్నలతో సహా షార్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు, వివిధ ఫార్మాట్లలో ప్రశ్నలు ఉంటాయి. టర్మ్‌ II పరీక్ష పేపర్ సమయం 2 గంటలు. అయితే కోవిడ్ -19(ఢేబుద-19) మహమ్మారి తగ్గుముఖం పట్టకపోతే.. బోర్డు మార్చి 2022 పరీక్షలను MCQ పేపర్‌ల విధానంలోనే నిర్వహించనుంది. ఈ పరీక్ష పేపర్ నిడివిని 90 నిమిషాలుగా నిర్ణయించింది.

JEE Main 2021: మరికొన్ని రోజుల్లో జేఈఈ మెయిన్ పూర్తి ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ను ఎలా కేటాయిస్తారంటే..

ఈ పరీక్షలను సీబీఎస్‌ఈ నియమించిన ఎక్స్టర్నల్ సెంటర్ సూపరింటెండెంట్లు, పరిశీలకుల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు బోర్డు అధికారులు. విద్యార్థుల సమాధానాలు OMR షీట్‌లలో భద్రపరిచి.. స్కానింగ్ చేసి తర్వాత నేరుగా సీబీఎస్‌ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. లేదంటే, ప్రత్యామ్నాయంగా మూల్యాంకనం చేస్తారు. అనంతరం ఆయా పాఠశాలలు విద్యార్థులు సాధించిన మార్కులను అదే రోజున అప్‌లోడ్ చేస్తాయి.

UBI Recruitment 2021: రూ.78,000 వేతనంతో యూనియన్ బ్యాంక్‌లో 347 ఉద్యోగాలు

ఇకపై ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లకు మరింత క్రెడిట్:
బోర్డ్ విద్యార్థుల సిలబస్‌ని విభజించడమే కాకుండా ఇంటర్నల్ అసెస్‌మెంట్స్, ప్రాజెక్ట్‌లను మరింత విశ్వసనీయంగా, ప్రామాణికంగా తీర్చిదిద్దేందుకు సీబీఎస్‌ఈ ప్రయత్నాలు చేస్తోంది. 9, 10వ తరగతుల విద్యార్థులకు మూడు పిరియాడిక్ పరీక్షలు, విద్యార్థి సుసంపన్న(enrichment) పోర్ట్‌ఫోలియో, ప్రాక్టికల్ వర్క్, స్పీకింగ్, లిజనింగ్ యాక్టివిటీస్ ఉండనున్నాయి. 11, 12వ తరగతుల విద్యార్థులకు ప్రతి టాపిక్ ఎండింగ్‌లో యూనిట్ పరీక్షలు ఉండనున్నాయి. అలాగే అన్వేషణాత్మక యాక్టివిటీస్, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. వచ్చే సంవత్సరంలో కరోనా వ్యాప్తి తగ్గకుండా పరిస్థితులు చక్కబడకపోతే ఈ పరీక్షలు ఉపయోగపడతాయి.

ప్రామాణికమైన ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ల కోసం సీబీఎస్‌ఈ బోర్డు శాంపిల్ అసెస్‌మెంట్స్, క్వశ్చన్ బ్యాంక్స్, తదితర స్టడీ మెటీరియల్స్ ఇవ్వనుంది. ఏడాదిలో నిర్వహించిన అన్ని అసెస్‌మెంట్స్ వివరాలను డిజిటల్ ఫార్మాట్‌లో సేవ్ చేసేందుకు పాఠశాలలు ప్రతి విద్యార్థి కోసం ప్రొఫైల్‌ను క్రియేట్ చేయనున్నాయి. తరగతిలోని విద్యార్థుల పనితీరు ఆధారంగా అసెస్‌మెంట్స్ డేటా సేకరణ జరుగుతుంది. కొత్త అకడమిక్ సెషన్ ప్రారంభంతో ఇంటర్నల్స్ ప్రారంభం కానున్నాయి.

హేతుబద్ధీకరించిన(Rationalized) సిలబస్:
బోర్డ్ పరీక్ష 2021-22 సిలబస్ ను గత విద్యా సంవత్సరం మాదిరిగానే రేషనలైజ్ చేస్తారు. పాఠ్యాంశాల నిర్వహణ కోసం ఎన్‌సీఈఆర్‌టి(NCERT) ఇన్‌పుట్‌లను ఉపయోగించాలని పాఠశాలలను బోర్డు ఆదేశించింది. అలాగే ఆల్టర్నేటివ్(alternative) విద్యా క్యాలెండర్ ఉపయోగించాలని పాఠశాలలకు బోర్డు సూచించింది.

ఫైనల్ రిజల్ట్:
ఫైనల్ రిజల్ట్స్ విద్యార్థులు ఇంటి నుంచి పూర్తి చేసిన ఇంటర్నల్ అసెస్‌మెంట్స్, ప్రాక్టికల్, ప్రాజెక్ట్ వర్క్, టర్మ్ పరీక్షల థియరీ మార్కుల ఆధారంగా లెక్కించనున్నారు.
Published by:Sumanth Kanukula
First published:

Tags: CBSE, Exams

తదుపరి వార్తలు