హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Board Exams 2021: సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్‌పై బిగ్ అప్‌డేట్.. నేడు లైవ్‌లో మాట్లాడనున్న కేంద్ర మంత్రి

CBSE Board Exams 2021: సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్‌పై బిగ్ అప్‌డేట్.. నేడు లైవ్‌లో మాట్లాడనున్న కేంద్ర మంత్రి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CBSE Board Exams 2021: ఇటీవలే జేఈఈ మెయిన్స్-2021 పరీక్ష తేదీలను ప్రకటించిన కేంద్ర విద్యా శాఖ.. నేడు మరో కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇటీవలే జేఈఈ మెయిన్స్-2021 పరీక్ష తేదీలను ప్రకటించిన కేంద్ర విద్యా శాఖ.. నేడు మరో కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ మంగళవారం ప్రకటన చేసే సూచనలు కనిపిస్తున్నాయి. తొలుత డిసెంబర్ 17న సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్‌పై ప్రకటన చేస్తామని చెప్పిన విద్యా శాఖ.. దానిని డిసెంబర్ 22కు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే కేంద్ర విద్యా శాఖ సోమవారం ట్విటర్‌లో చేసిన ఓ పోస్ట్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సోషల్ మీడియా వేదికగా లైవ్‌లో అందుబాటులో ఉంటారని తెలిపింది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఆయనతో ఇంటరాక్ట్ కావచ్చని పేర్కొంది.

మరోవైపు విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ కూడా ఇదే రకమైన సందేశాన్ని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. "టీచర్స్, దయచేసి మీ క్యాలెండర్స్‌ను మార్క్ చేసి పెట్టుకోండి. నేను రేపు సాయంత్రం 4 గంటలకు Twitter/Facebook (@DrRPNishank) ద్వారా లైవ్‌లో మాట్లాడతాను. బోర్టు ఎగ్జామ్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను. మీ సహచర టీచర్లకు కూడా ఈ లైవ్‌ సెషన్‌లో జాయిన్ అవ్వమని చెప్పండి"అంటూ పేర్కొన్నారు. అయితే నేడు విద్యా శాఖ మంత్రి పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీబీఎస్‌ఈ ఎగ్జామ్స్‌పై నెలకొన్న సందేహాలకు సమాధానం ఇవ్వడంతో పాటు, పరీక్ష విధి విధానాలు, సెలబస్ తగ్గింపుపై ప్రకటన చేసే అవకాశం ఉందని వారు అంటున్నారు.


డిసెంబర్ 10న కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విద్యార్థులతో మాట్లాడుతూ ఈసారి బోర్డు ఎగ్జామ్స్‌లో అనేక మార్పులు ఉండొచ్చని సూచనప్రాయంగా తెలిపారు. విద్యార్థులకు పరీక్షలకు సిద్ధం కావడానికి చాలా సమయం ఇస్తామని మంత్రి తెలిపారు. పరీక్ష తేదీలను చాలా ముందుగానే ప్రకటిస్తామని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పరిస్థితి సీబీఎస్ఈకి తెలుసని, బోర్డు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ముందుగా వారిని సంప్రదిస్తుందని సీబీఎస్ఈ క్లారిటీ ఇచ్చింది.


మరోవైపు, కరోనా నేపథ్యంలో ఈసారి సీబీఎస్‌ఈ బోర్డు ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. మరోవైపు మార్చిలోనే సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఉంటాయని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది.

First published:

Tags: CBSE, CBSE Board Exams 2021

ఉత్తమ కథలు