హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE: సీబీఎస్‌ఈ స్టూడెంట్స్ కు అలర్ట్.. ఈ టిప్స్ తో బోస్ట్ స్కోర్‌.. ఓ లుక్కేయండి

CBSE: సీబీఎస్‌ఈ స్టూడెంట్స్ కు అలర్ట్.. ఈ టిప్స్ తో బోస్ట్ స్కోర్‌.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగానే పరీక్షలకు ముందు విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు. ప్రణాళిక ప్రకారం చదివి, ప్రిపరేషన్‌ సకాలంలో పూర్తి చేస్తే ఎలాంటి ఆందోళన ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

సాధారణంగానే పరీక్షలకు ముందు విద్యార్థులు ఒత్తిడికి లోనవుతారు. ప్రణాళిక ప్రకారం చదివి, ప్రిపరేషన్‌ సకాలంలో పూర్తి చేస్తే ఎలాంటి ఆందోళన ఉండదని నిపుణులు సూచిస్తున్నారు. సీబీఎస్‌ఈ బోర్డ్ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ప్రిపరేషన్‌కు సరిగ్గా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో విద్యార్థులు సిలబస్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. టైమ్ మేనేజ్‌మెంట్ పాటిస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అన్ని సబ్జెక్టులను రివిజన్ చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి. అయితే ప్రస్తుతం సీబీఎస్‌ఈ బోర్డ్ పదో తరగతి ఫిజిక్స్ పరీక్షలో బెస్ట్ స్కోర్ ఎలా సాధించాలో తెలుసుకుందాం. ముఖ్యమైన టాపిక్స్, చాప్టర్స్, స్కోరింగ్ గైడ్‌లైన్స్, ప్రిపరేషన్ ప్లాన్స్‌ను పరిశీలిద్దాం.

ఇంపార్టెంట్ టాపిక్స్

1. న్యాచురల్‌ ఫినామినన్

సీబీఎస్‌ఈ టెన్త్‌ క్లాస్‌ ఫిజిక్స్‌లో న్యాచురల్‌ ఫినామినన్‌ విభాగంలో..రే డయాగ్రమ్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ అండ్ లెన్సెస్, న్యూమరికల్ ఆఫ్ మిర్రర్స్ అండ్ లెన్సెస్ ఇన్వాలింగ్ మ్యాగ్నిఫికేషన్, హ్యూమన్‌ ఐ డిఫెక్ట్స్ అండ్ కరెక్షన్స్ విత్ కాజెస్, రే డయాగ్రమ్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ అండ్ ప్రిజమ్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ వంటి ముఖ్యమైన టాపిక్స్‌ను కచ్చితంగా కవర్‌ చేయాలి.

2.ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్

ఈ విభాగం నుంచి కూడా ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు.. బేసిక్ డెఫినేషన్ ఆఫ్ కరెంట్, పీ.డీ, రెసిస్టెన్స్, రెసిస్టివిటీ అండ్ ఫ్యాక్టర్స్, సిరీస్ & పార్లల్ కాంబినేషన్ (న్యూమరికల్), ఓమ్స్(ohm’s) లా అండ్ గ్రాఫ్, పవర్ అండ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ(న్యూమరికల్) వంటి ముఖ్యమైన అంశాలను చదవాలి. అదే విధంగా మాగ్నటిక్ ఫీల్డ్ & లైన్స్ ఇన్ స్ట్రైట్ వైర్, సర్క్యులర్‌ సాయిల్, సోలేనాయిడ్ అండ్ ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ ఇట్ డిపెండ్స్‌, ఫోర్స్ ఆన్ ద కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఇన్ ద మ్యాగ్నిటిక్ ఫీల్డ్, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఆల్టర్‌నేటింగ్ కరెంట్, డైరెక్ట్ కరెంట్ అండ్ అడ్వాంటేజెస్‌, క్యారెక్టర్‌స్టిక్స్ ఆఫ్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్‌ వంటి టాపిక్‌లపై పట్టు సాధించాలి.

ఛాప్టర్స్ వారీగా వెయిటేజ్

యూనిట్ - III న్యాచురల్‌ ఫినామినన్ నుంచి 12 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఛాప్టర్-10: లైట్-రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, ఛాప్టర్-11: హ్యూమన్‌ ఐ అండ్ కలర్‌పుల్ వరల్డ్ ఉన్నాయి. యూనిట్-IV ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ నుంచి 13 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఛాప్టర్-12: ఎలక్ట్రిసిటీ, ఛాప్టర్-13: మ్యాగ్నటిక్‌ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వంటి ఛాప్టర్లు ఉన్నాయి.

ప్రిపరేషన్ టిప్స్

సీబీఎస్‌ఈ పదో తరగతి విద్యార్థులు ఫిజిక్స్ పేపర్‌లో మంచి స్కోర్ సాధించాలంటే కాన్సెప్ట్స్ అండ్ కంటెంట్‌పై పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఇందుకోసం NCERT ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా రే డయాగ్రమ్స్ అండ్ ఫీల్డ్ లైన్స్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. క్రమం తప్పకుండా రివిజన్ చేస్తుండాలి. సీబీఎస్ ఈ శాంపుల్ పేపర్ అనుగుణంగా విద్యార్థుల ప్రిపరేషన్ ఉండాలి. న్యూమరికల్, సిరీస్ అండ్ పార్లల్ ఆఫ్ రెసిస్‌టెన్స్, స్నెల్ లా, మిర్రర్ అండ్ లెన్స్ ఫార్మూలా‌ను ప్రతి రోజూ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రిపరేషన్ కొనసాగిస్తే ఫిజిక్స్ పేపర్‌లో టాప్ స్కోర్ మీ సొంతం అవుతుంది.

First published:

Tags: CBSE, Exam Tips, JOBS

ఉత్తమ కథలు