Home /News /jobs /

CBSE BOARD EXAM 2023 CENTRAL BOARD OF SECONDARY EDUCATION DISCONTINUED TWO TERMS EXAMS AND GONE BACK TO THE ANNUAL EXAMINATION SYSTEM SS

CBSE Board Exams: సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్‌లో కీలక మార్పులు... సిలబస్ కూడా మారింది

CBSE Board Exams: సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్‌లో కీలక మార్పులు... సిలబస్ కూడా మారింది
(ప్రతీకాత్మక చిత్రం)

CBSE Board Exams: సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్‌లో కీలక మార్పులు... సిలబస్ కూడా మారింది (ప్రతీకాత్మక చిత్రం)

CBSE Board Exam 2023 | సీబీఎస్ఈ 2023లో నిర్వహించబోయే బోర్డు పరీక్షల (CBSE Board Exams) విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సిలబస్‌లో కూడా పలు మార్పులు చేసింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2023 బోర్డు పరీక్షల్లో కీలక మార్పుల్ని ప్రకటించింది. మళ్లీ యాన్యువల్ ఎగ్జామ్ పద్ధతికి మారుతున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. 2022 బ్యాచ్ వారికి మాత్రమే టర్మ్ 1, టర్మ్ 2 పరీక్షలు ఉంటాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2021లో కొన్ని పరీక్షలను నిర్వహించలేకపోయింది సీబీఎస్ఈ. 202 0లో ఎలాంటి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాలేదు. ఇప్పుడు కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో రెండు టర్మ్‌ల పరీక్షల విధానాన్ని తొలగించి యాన్యువల్ ఎగ్జామ్ పద్ధతి ఫాలో కానుంది. మరోవైపు బోర్డు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సిలబస్‌లో మార్పులు కూడా చేసింది.

రెండేళ్ల క్రితం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సీబీఎస్ఈ పరీక్షలతో పాటు ఇతర పరీక్షల్ని నిర్వహించడం సాధ్యం కాలేదు. దీంతో సీబీఎస్ఈ సిలబస్‌ను 30 శాతం తగ్గించింది. తగ్గించిన సిలబస్ ప్రకారమే పరీక్షల్ని నిర్వహించింది. ఇప్పుడు కోవిడ్ ప్రభావం తగ్గిపోవడంతో పాత సిలబస్ ప్రకారమే పరీక్షల్ని నిర్వహించబోతోంది. కొన్ని చాప్టర్స్‌లో మార్పులు చేసింది.

TCS Jobs for Women: మహిళలకు టీసీఎస్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

అకడమిక్ సెషన్‌ను విభజించడం, రెండు టర్మ్-ఎండ్ పరీక్షలను నిర్వహించడం, సిలబస్‌ను క్రమబద్ధీకరించడం లాంటి నిర్ణయాలు కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో అప్పటి పరిస్థితులను బట్టి పెట్టుకొని తీసుకున్నవని సీబీఎస్ఈ తెలిపింది. 2021-22లో క్లాస్ 10, క్లాస్ 12 బోర్డు పరీక్షల కోసం ప్రత్యేక మూల్యాంకన స్కీమ్‌ను అమలు చేసింది.

అయితే తమ బ్యాచ్ విద్యార్థులు మాత్రమే రెండు సార్లు బోర్డు పరీక్షలకు హాజరుకావడం అన్యాయమని ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే టర్మ్ 1 పరీక్షలు ముగిశాయి. టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభం కానున్నాయి. ఈ బ్యాచ్ విద్యార్థులకు మాత్రమే రెండు టర్మ్ పరీక్షలు ఉంటాయి. అయితే టర్మ్ 2 పరీక్షలను రద్దు చేసి టర్మ్ 1, ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగా తుది ఫలితాలను లెక్కించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

UPSC Civil Services: సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారా? మీరు గతంలో అడిగిన ట్రిక్కీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా..?

ఓవైపు పాఠశాలల్ని మూసివేయడం వల్ల కలిగే నష్టాల గురించి నిపుణులు హెచ్చరిస్తున్నా, మరోవైపు పెరుగుతున్న కోవిడ్ 19 కేసులు మళ్లీ పాఠశాలల మూసివేతకు దారితీస్తుందన్న ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అనేక పాఠశాలల్లో విద్యార్థులకు, సిబ్బందికి కోవిడ్ సోకినట్టు వార్తలొస్తున్నాయి. దీంతో ఆయా తరగతుల్ని మూసివేస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: CAREER, Career and Courses, CBSE, Cbse exams, Exams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు