CBSE Board Exam 2023: సాధారణంగా విద్యార్థులు పరీక్షల(Exams) సమయంలో ఒత్తిడికి గురవుతుంటారు. ఈ కారణంగానే ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేరు. సరైన ప్రణాళిక, పట్టుదలతో ఒత్తిడిని సులువుగా అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) 10, 12వ తరగతి పరీక్షలు 2023 ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల ప్రిపరేషన్‌కు కేవలం రెండున్నర నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఉండాలంటే ప్రిపరేషన్ పకడ్బందీగా ఉండాలి. సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షల్లో బెస్ట్ స్కోర్ సాధించడానికి అనుసరించాల్సిన ప్రిపరేషన్ టిప్స్‌ను ఇప్పుడు పరిశీలిద్దాం.
సిలబస్‌పై పూర్తి అవగాహన
సీబీఎస్ఈ బోర్డ్ 10,12వ తరగతి పరీక్షలకు అందుబాటులో ఉన్న తక్కువ సమయంలో సమర్థంగా ప్రిపేర్ కావాలంటే ముందుగా సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్‌పై పూర్తి అవగాహన ఉండాలి. దీంతో ఒత్తిడి తగ్గి, పరీక్షలను సులభంగా ఎదుర్కొవడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. ఏ టాపిక్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో అంచనా వేయడానికి సిలబస్ సహాయం చేస్తుంది.
టైమ్ టేబుల్ అండ్ స్టడీ ప్లాన్
సిలబస్‌పై పూర్తి అవగాహనకు వచ్చిన తరువాత విద్యార్థులు ప్రిపరేషన్ కోసం టైమ్ టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. అందుకు తగ్గట్టు ప్రిపేరేషన్ ప్రారంభించాలి. అలాగే స్టడీ ప్లాన్ కూడా వేసుకోవాలి. ఏ సమయంలో ఏ సబ్జెక్ట్ చదవాలి. దేనికి ఎక్కువ సమయం కేటాయించాలి తదితర విషయాలపై స్టడీ ప్లాన్ ఉండాలి. దీంతో ప్రిపరేషన్లో టైమ్ మేనేజ్మెంట్ పాటించడానికి, సిలబస్ త్వరగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది.
శాంపుల్ పేపర్స్ ప్రాక్టీస్
శాంపుల్ క్వశ్చన్ పేపర్లను సాల్వ్ చేయడం ద్వారా ప్రిపరేషన్ ఎంత సమర్థంగా చేస్తున్నారో తెలుస్తుంది. పరీక్ష సమయంలో అడిగే ప్రశ్నల రకాలను విద్యార్థులు అర్థం చేసుకోవడానికి, ఎగ్జామ్ ప్యాట్రన్‌పై పూర్తిస్థాయి అవగాహన రావడానికి శాంపుల్ క్వశ్చన్ పేపర్లు ఉపయోగపడతాయి. సీబీఎస్ఈ 10, 12 తరగతులకు సంబంధించిన అన్ని రకాల సబ్జెక్ట్స్ పై ఇప్పటికే శాంపుల్ పేపర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డ్ అధికారిక వెబ్సైట్ cbseacademic.nic.in ద్వారా వీటిని చెక్ చేసి, ప్రాక్టీస్ చేయవచ్చు.
రివిజన్
విద్యార్థులు ఎలాంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా సిలబస్ పూర్తిచేసిన తరువాత మరోసారి రివిజన్ చేస్తే పరీక్షలను సులువుగా ఎదుర్కోవచ్చు. ప్రిపరేషన్ స్ట్రాటజీకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో రివిజన్‌కు కూడా అదే స్థాయిలో ప్రాముఖ్యత ఇవ్వాలి. మొత్తం సిలబస్‌ను కవర్ చేసిన తర్వాత ముఖ్యమైన చాప్టర్స్, టాపిక్స్‌ను రివైజ్ చేయడం ద్వారా పరీక్షల్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
బ్రేక్స్- హెల్తీ ఫుడ్
చాలా మంది విద్యార్థులు పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రిపరేషన్ టైమ్‌ను పెంచుకుంటూ పోతుంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్రిపరేషన్లో అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటూ ఉండాలి. పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేస్తే పరీక్షల సమయంలో చాలా చురుకుగా ఉంటారు. సమయానికి నిద్ర పోవడం కూడా చాలా ముఖ్యం. దీంతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పరీక్షలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Cbse exams