సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్(CBSE) ఎట్టకేలకు ఈ రోజు 10, 12 పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. పరీక్ష తేదీలను ట్విట్టర్ ద్వారా కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆయన విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. క్లాస్ 12 పరీక్షలు మే 04 న ప్రారంభం కానున్నాయి. జూన్ 11న ఆ పరీక్షలు ముగియనున్నాయి. ఈ పరీక్షలు రెండు షిఫ్ట్ లలో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉంటుంది. ఈ షిఫ్ట్ కు సంబంధించి ఉదయం 10 గంటల నుంచి 10.15 నిమిషాల మధ్య విద్యార్థులకు ఆన్సర్ షీట్లు పంపిణీ చేస్తారు. సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5. 30 వరకు ఉంటుంది. ఈ షిఫ్ట్ కు సంబంధించి 2 గంటల నుంచి 2.15 గంటల వరకు ఆన్సర్ షీట్ ను పంపిణీ చేస్తారు. క్లాస్ 10 పరీక్షలు మే 4న ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు వీటిని నిర్వహించనున్నారు. జూన్ 7న ఈ పరీక్షలు ముగియనున్నాయి. కింద అందించిన లింక్స్ ద్వారా విద్యార్థులు పూర్తి షెడ్యూల్ ను తెలుసుకోవచ్చు.
Date-sheet of @cbseindia29 board exams of class Xll.
Wish you good luck!#CBSE pic.twitter.com/LSJAwYpc7j
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) February 2, 2021
మార్చి 1 నుంచి స్కూల్స్ ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహించనున్నాయి. పరీక్షలను కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా కరోనా ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. శానిటైజర్ ను వెంట తెచ్చుకోవాలి. సోషల్ డిస్టెన్స్ ను పాటించాలి. ప్రతీ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు జనవరిలో నిర్వహించేవారు. రాత పరీక్షలను ఫిబ్రవరి నుంచి మార్చి వరకు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో పరీక్షలు చాలా ఆలస్యమయ్యాయి. అసలు పరీక్షలు ఉంటాయా? ఉండవా? అన్న ఆందోళన సైతం విద్యార్థుల్లో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE Board Exams 2021