CBSE Board Exam 2020 | ఫిబ్రవరి 15న మల్టీ మీడియా, మాస్ మీడియా స్టడీస్, ఫుడ్ ప్రొడక్షన్ లాంటి సబ్జెక్ట్స్తో పరీక్షలు మొదలవుతాయి. ప్రధాన సబ్జెక్టుల పరీక్షల తేదీలను తెలుసుకోండి.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 10వ తరగతి, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ 2020 షెడ్యూల్ను ప్రకటించింది. సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్ http://cbse.nic.in/ లో ఎగ్జామ్ షెడ్యూల్ను అప్లోడ్ చేసింది. 2020 ఫిబ్రవరి 15న సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు షెడ్యూల్ చూసుకొని ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. నోటిఫికేషన్ ప్రకారం 10వ తరగతి మెయిన్ సబ్జెక్ట్స్కు పరీక్షలు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 వరకు జరుగుతాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 22 నుంచి మార్చి 30 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 15న మల్టీ మీడియా, మాస్ మీడియా స్టడీస్, ఫుడ్ ప్రొడక్షన్ లాంటి సబ్జెక్ట్స్తో పరీక్షలు మొదలవుతాయి. ప్రధాన సబ్జెక్టుల పరీక్షల తేదీలను తెలుసుకోండి.
CBSE 10th Class Exam Schedule: సీబీఎస్ఈ 10వ తరగతి ఎగ్జామ్ షెడ్యూల్
ఫిబ్రవరి 26- ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ & లిటరేచర్
ఫిబ్రవరి 29- హిందీ కోర్స్ ఏ, హిందీ కోర్స్ బీ
మార్చి 4- సైన్స్ థియరీ, సైన్స్ ప్రాక్టికల్
మార్చి 12- మ్యాథమెటిక్స్ స్టాండర్డ్, మ్యాథమెటిక్స్ బేసిక్
మార్చి 18- సోషల్ సైన్స్
CBSE 12th Class Exam Schedule: సీబీఎస్ఈ 12వ తరగతి ఎగ్జామ్ షెడ్యూల్
ఫిబ్రవరి 27- ఇంగ్లీష్ ఎలక్టీవ్ ఎన్, ఇంగ్లీష్ ఎలక్టీవ్ సీ, ఇంగ్లీష్ కోర్
మార్చి 2- ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్
మార్చి 7- కెమిస్ట్రీ
మార్చి 14- బయాలజీ
మార్చి 17- మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్
CBSE 12th Commerce Exam Schedule: సీబీఎస్ఈ 12వ తరగతి కామర్స్ ఎగ్జామ్ షెడ్యూల్
ఫిబ్రవరి 27- ఇంగ్లీష్ ఎలక్టీవ్ ఎన్, ఇంగ్లీష్ ఎలక్టీవ్ సీ, ఇంగ్లీష్ కోర్
మార్చి 5- అకౌంటెన్సీ
మార్చి 13- ఎకనమిక్స్
మార్చి 17- మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్
మార్చి 21- కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
మార్చి 24- బిజినెస్ స్టడీస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
CBSE 12th Arts Exam Schedule: సీబీఎస్ఈ 12వ తరగతి ఆర్ట్స్ ఎగ్జామ్ షెడ్యూల్
ఫిబ్రవరి 22- సైకాలజీ
ఫిబ్రవరి 27- ఇంగ్లీష్ ఎలక్టీవ్ ఎన్, ఇంగ్లీష్ ఎలక్టీవ్ సీ, ఇంగ్లీష్ కోర్
మార్చి 3- హిస్టరీ
మార్చి 6- పొలిటికల్ సైన్స్
మార్చి 23- జాగ్రఫీ
మార్చి 26- హోమ్ సైన్స్
మార్చి 30- సోషియాలజీ
సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వివరంగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ వివరంగా తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.