CBSE Result: మే మూడో వారంలో సీబీఎస్ఈ 10, 12 ఫలితాలు

CBSE Result | సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 21న ప్రారంభమై మార్చి 29న ముగిశాయి.

news18-telugu
Updated: April 4, 2019, 6:36 PM IST
CBSE Result: మే మూడో వారంలో సీబీఎస్ఈ 10, 12 ఫలితాలు
CBSE Result: మే మూడో వారంలో సీబీఎస్ఈ 10, 12 ఫలితాలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: April 4, 2019, 6:36 PM IST
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) 10, 12వ తరగతి ఫలితాలను మే మూడో వారంలో విడుదల చేస్తామని సీబీఎస్ఈ అధికారికంగా ప్రకటించింది. సీబీఎస్ఈ సీనియర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రమా శర్మ హిందుస్తాన్ టైమ్స్‌కు ఈ విషయాన్ని తెలిపారు. సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 21న ప్రారంభమై మార్చి 29న ముగిశాయి.

12వ తరగతి ఫిజిక్స్, ఎకనమిక్స్ పరీక్షల్ని మళ్లీ నిర్వహిస్తారని వాట్సప్‌లో జరుగుతున్న ప్రచారాన్ని మంగళవారం సీబీఎస్ఈ ఖండించింది. వాట్సప్‌లో సర్క్యులేట్ అవుతున్న సమాచారం తప్పని తేల్చి చెప్పింది. "ఫిజిక్స్, ఎకనమిక్స్ పరీక్షల్ని మళ్లీ నిర్వహిస్తామని సీబీఎస్ఈ మాజీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కేకే చౌదరీ సంతకంతో మార్చి 28 నుంచి వాట్సప్‌లో సర్క్యులేట్ అవుతున్న లేఖ అవాస్తవం. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించగలరు" అని సీబీఎస్ఈ వివరణ ఇచ్చింది.

Photos: ప్రపంచంలోనే పొడవైన బస్సు... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

SBI: మీ ఏటీఎం లిమిట్ మీరే సెట్ చేసుకోండి ఇలా...

Flash Sale: రూ.19,999 విలువైన పోకో ఎఫ్1... ఒక్క రూపాయికే
Loading...
WhatsApp Feature: వాట్సప్‌లో ఫేక్ న్యూస్ ఇలా చెక్ చేయండి...
First published: April 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...