హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Announcement: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల హాజరుపై సీబీఎస్‌ఈ కీలక ప్రకటన.. ఏంటంటే..

CBSE Announcement: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల హాజరుపై సీబీఎస్‌ఈ కీలక ప్రకటన.. ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు టర్మ్ 1 లేదా టర్మ్ 2 ఎగ్జామ్స్‌లో ఏదో ఒక పరీక్ష రాయకపోయినా వారి ఫలితాలను ప్రకటిస్తామని ప్రకటించింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు టర్మ్ 1 లేదా టర్మ్ 2 ఎగ్జామ్స్‌లో(Exam) ఏదో ఒక పరీక్ష రాయకపోయినా వారి ఫలితాలను ప్రకటిస్తామని ప్రకటించింది. ఇటీవల జరిగిన ప్రత్యేక వెబ్‌నార్ సెషన్‌లో పాఠశాలలను ఉద్దేశించి బోర్డు(Board) ఈ వ్యాఖ్యలు చేసింది. ఇది ఇలా ఉంటే 10, 12 తరగతుల విద్యార్థులకు టర్మ్ 2 బోర్డు పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభమవుతాయి. ఈ ఏడాది దాదాపు 35 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. టర్మ్ 1 పరీక్షలకు(Term 1 Exams) హాజరుకాని విద్యార్థులు(Students), టర్మ్ 2 (Term 2) పరీక్షలకు హాజరు కావడానికి ఇప్పటికే బోర్డు అనుమతించింది. ఇలాంటి విద్యార్థులు సాధారణ విద్యార్థుల మాదిరి ఫలితాలను తెలుసుకోనున్నారు. ఎవరైనా ఓ విద్యార్థి టర్మ్ 2 పరీక్షలు రాయలేకపోయినా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, పరీక్షలకు హాజరుకాకపోవడానికి బలమైన కారణం ఉండాలి. దాన్ని బోర్డు సమర్థించాలి. అప్పుడు సదరు విద్యార్థి ఫలితాన్ని లెక్కించడానికి ఓ మార్గాన్ని కనుగొననున్నారు.

ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఫలితాల లెక్కింపునకు సంబంధించిన ఫార్ములాను CBSE ఇంకా ప్రకటించలేదు. సాధరణంగా ఫలితాలను టర్మ్ 1, టర్మ్ 2, ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగా లెక్కిస్తారు. అయితే ఈ మూడు భాగాలకు ఎంత వెయిటేజీ ఇస్తారో ఇప్పటికీ ప్రకటించలేదు. విద్యార్థులు రెండు పరీక్షల్లో దేనికైనా హాజరు కాలేకపోతే బోర్డు తదనుగుణంగా ఫలితాలను లెక్కించడానికి ఓ ఫార్ములాను సర్దుబాటు చేయనుంది.

Moto G52: బడ్జెట్ ధరలో మోటో జీ52స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

ఒకవేళ ఏ విద్యార్థి అయినా టర్మ్ 1, టర్మ్ 2 రెండింటిలోనూ గైర్హాజరైతే.. బోర్డు సదరు విద్యార్థి ఫలితాలను లెక్కించదు. అలాంటి విద్యార్థులు వచ్చే ఏడాది పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. అటువంటి విద్యార్థులను కంపార్ట్‌మెంట్ పరీక్షలకు అనుమతించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే, అన్ని సబ్జెక్టులకు ఒకే రోజు కంపార్ట్‌మెంట్ పరీక్షలను నిర్వహించాలన్న దానిపై బోర్డు పరిశీలిస్తోంది. దీంతో గైర్హాజరైనవారు ప్రత్యామ్నాయంగా కంపార్ట్‌మెంటల్ పరీక్షలను ఒకే రోజు రాయడం అసాధ్యం.

* కరోనా సోకిన విద్యార్థులకు అనుమతి

ఎవరైనా ఓ విద్యార్థికి కోవిడ్ పాజిటివ్ అని తేలినప్పుడు, సదరు విద్యార్థి పరీక్ష రాయడానికి బోర్డు అనుమతించింది. అయితే అలాంటి వారి కోసం ప్రత్యేక ఐసోలేషన్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే సదరు విద్యార్థి ముందుగా అధికారులకు సమాచారం తెలిజేయాల్సి ఉంటుంది. కాగా, సీబీఎస్‌ఈ ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి. టర్మ్ 1 పరీక్షలు ఇప్పటికే నిర్వహించగా, టర్మ్ 2 పరీక్షలు త్వరలో ప్రారంభం కానున్నాయి. టర్మ్ 1 పరీక్షలు MCQ ఫార్మాట్‌లో జరిగాయి. టర్మ్ 2 పరీక్షలు రాత పూర్వకంగా ఉంటుంది. టర్మ్ 2 పరీక్షల సందర్భంగా బోర్డు కోవిడ్ రూల్స్ పాటించి ఏర్పాట్లు చేసింది. పరీక్ష సందర్భంగా విద్యార్థులు సామాజిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేసింది. ఒక పరీక్ష హాలులో మొత్తం 18 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాయనున్నారు. ఒక్కో పరీక్ష హాలులో ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉంటారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, NEET 2022

ఉత్తమ కథలు