Home /News /jobs /

CBSE 12TH TERM 2 RESULTS RELEASED HERE IS THE DIRECT LINKS TO CHECK YOUR RESULTS NS

CBSE 12th Results: సీబీఎస్ఈ 12వ తరగతి టర్మ్-2 ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్ చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీబీఎస్ఈ 12వ తరగతికి సంబంధించిన ఫలితాలను అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు.

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి టర్మ్‌ 2 పరీక్షల ఫలితాలను కొద్ది సేపటి క్రితం అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు cbse.gov.in, cbseresults.nic.in, digilocker.gov.in, parikshasangam.cbse.gov.in వెబ్ సైట్లలో తమ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో మొత్తం 92.71 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. బాలురకంటే.. బాలికలు ఎక్కువ ఉత్తీర్ణత శాతం నమోదు చేసి సత్తా చాటారు. 33 వేల మందికి పైగా విద్యార్థులు 95 శాతానికి పైగా స్కోర్ సాధించడం విశేషం. 1.34 లక్షల మంది విద్యార్థులకు 90 శాతానికి పైగా మార్కులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 21 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలకు హాజరుకాగా, మొత్తం 14 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు.

    విద్యార్థులు ఈ స్టెప్స్ తో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు..
    Step 1: ముందుగా సీబీఎస్ఈ బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://www.cbse.gov.in/ ను ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం హోం పేజీలో మీకు Results లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
    Step 3: తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో Senior School Certificate Examination (Class XII) Results 2022 లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
    Step 4: దీంతో మీకు రిజల్ట్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో రూల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
    Step 5: అనంతరం హోం పేజీలో మీ రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CBSE, Cbse results, Exams, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు