Home /News /jobs /

CBSE 12TH TERM 2 EXAMS 2022 MOST IMPORTANT TOPICS FOR BIOLOGY PAPER NS GH

CBSE 12th Biology: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ప్రిపరేషన్ టిప్స్.. బయాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామ్స్ (CBSE) 12వ తరగతి టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి స్టార్ట్ కానున్నాయి. బయాలజీ ఎగ్జామ్ కోసం కొన్ని టాపిక్స్ బాగా చదవాలి అని చెబుతున్నారు నిపుణులు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామ్స్ (CBSE) 12వ తరగతి టర్మ్ 2 పరీక్షలు (Exams) ఏప్రిల్ 26 నుంచి స్టార్ట్ కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్షల్లో బాగా స్కోర్ చేయడానికి మొత్తం సిలబస్‌ని చదవాల్సి ఉంటుంది. ఈ మొత్తం సిలబస్‌లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ బాగా చదవడం ద్వారా అందరి కంటే ఎక్కువ స్కోర్ సాధించవచ్చు. ముఖ్యంగా బయాలజీ ఎగ్జామ్ కోసం కొన్ని టాపిక్స్ బాగా చదవాలి అని చెబుతున్నారు నిపుణులు. అలాగే కరోనా కారణంగా రైటింగ్ ప్రాక్టీస్ కోల్పోయిన విద్యార్థులు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక బయాలజీ ఎగ్జామ్ కోసం చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవో చూద్దాం.

హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్
క్యాజువల్ ఆర్గానిజం, సింప్టమ్స్, ఎఫెక్ట్స్ తో సహా హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్ (Human Health And Disease) చాప్టర్ లో ఇచ్చిన హ్యూమన్ డిసీజ్ ల కోసం ఒక టేబుల్ క్రియేట్ చేసుకోండి. ఇమ్యూనిటీ, ఎయిడ్స్, క్యాన్సర్ వంటి కాన్సెప్ట్‌లను అర్థం చేసుకున్న తర్వాతే ఫ్లో చార్ట్‌లను తయారు చేసుకోవాలి. ఆల్కహాల్, డ్రగ్స్ అబ్యూస్ ని ఒక కాన్సెప్ట్ గా సొంతంగా నేర్చుకోవాలి. తర్వాత వీటి ఎఫెక్ట్స్, సొల్యూషన్స్ నేర్చుకోవాలి.
CBSE Term 2 Exams: రెండేళ్ల తర్వాత చేతిరాత పద్ధతిలో పబ్లిక్‌ పరీక్షలు.. విద్యార్థులకు ఆ ఇబ్బందులు తప్పవా?

మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్
మైక్రోబ్స్ లేదా సూక్ష్మజీవుల (Microbes) అప్లికేషన్ల ప్రతి కేటగిరి కోసం టేబుల్‌లను రూపొందించండి. అలాగే మురుగునీటి శుద్ధి (Sewage Treatment), బయోగ్యాస్ ప్లాంట్ (Biogas Plant) ఫంక్షనింగ్ కోసం ఫ్లో చార్ట్ తయారు చేసుకోండి. బీఓడీ (BOD) గురించి, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి. ఇందుకు వాటర్ పొల్యూషన్ పారామీటర్స్ కొలవండి. ఇది నాలెడ్జ్ బేస్డ్ చాప్టర్ కాబట్టి రెగ్యులర్ గా దీన్ని రివిజన్ చేసుకోవడం మంచిది.
CBSE Term 2 Exam: మరికొన్ని రోజుల్లో సీబీఎస్‌ఈ టర్మ్‌ 2 పరీక్షలు.. పరీక్షలకు ముందు మీ సత్తా ఎంతో చెక్‌ చేసుకోండి..

బయో టెక్నాలజీ
విద్యార్థులు బయోటెక్నాలజీ రంగంలో ఉపయోగించే డిఫరెంట్ టెక్నిక్ లకు సంబంధించిన ఫ్లో చార్ట్‌లను రూపొందించవచ్చు. బేసిక్ రీకాంబినెంట్ DNA టెక్నాలజీ నుంచి మెడిసిన్, అగ్రికల్చర్, మాలిక్యులర్ డయాగ్నసిస్‌ టాపిక్స్ బాగా చదవండి. వాటిపై ఫ్లో చార్ట్‌లు క్రియేట్ చేసుకోండి. ఫ్లో చార్ట్‌లు లేదా బుల్లెట్ పాయింట్‌లను ఉపయోగించడం ద్వారా బయోటెక్నాలజీలో డిఫరెంట్ అప్లికేషన్‌లను సొంతంగా నేర్చుకోండి.

ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్
ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్ (Organisms And Populations) చాప్టర్ లో ఇచ్చిన డిఫరెంట్ ఆర్గానిజమ్స్ గ్రూప్స్.. డిఫరెంట్ అబయోటిక్ ఫ్యాక్టర్స్(Abiotic Factors) కు ఎలా రెస్పాండ్ అవుతాయో తెలుసుకోండి. డిఫరెంట్ గ్రాఫ్‌లు, గ్రోత్ మోడల్స్, పాపులేషన్ స్టడీపై విశ్లేషణాత్మక అధ్యయనం చేయండి. డిఫరెంట్ ఆర్గానిజమ్స్ వాటి ఆవాసాలలో ఎలాంటి పాత్ర పోషిస్తాయో దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ పాపులేషన్ల ఇంటరాక్షన్స్ స్టడీ చేయాలి.

బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ కన్సర్వేషన్ - జీవవైవిధ్యం, దాని పరిరక్షణ
ఈ చాప్టర్ (Biodiversity And Its Conservation) లోని బయోడైవర్సిటీ టైప్స్, బయోడైవర్సిటీ ప్యాట్రన్స్, ట్రెడిషనల్, మోడ్రన్ కన్జర్వేషన్ మెథడ్స్ బాగా నేర్చుకోండి. రాబర్ట్ మే (Robert May) అన్ని కాంట్రిబ్యూషన్లను నోట్ చేసుకోండి. వాటిని ఒక దగ్గర రాసుకోండి. ఇది ఈవెంట్‌లను పరస్పరం అనుసంధానించడానికి సహాయపడుతుంది. ఇంకా, పాల్ ఎర్లిచ్ (Paul Ehrlich), అలెగ్జాండర్ హంబోల్ట్ (Alexander Humboldt) వర్క్ పై ఫోకస్ చేయండి. NCERTలో ఈవిల్ క్వార్టట్ (Evil Quartet)లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ బాగా ఫాలో అవ్వండి. రెడ్ డేటా బుక్, బయోడైవర్సిటీ కోసం ఇచ్చిన గణాంకాలపై బదులుగా ఫ్యాక్ట్స్ పై దృష్టి పెట్టండి. బయాలజీలో మంచి స్కోర్ సాధించాలంటే బట్టి పట్టకుండా కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే తరచుగా రివైజ్ చేసుకుంటూ మీకు మీరు టెస్టులు పెట్టుకుంటూ ఇంప్రూవ్ అవ్వాలి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Career and Courses, CBSE, Exam Tips

తదుపరి వార్తలు