Home /News /jobs /

CBSE 12TH TERM 1 RESULT DATE TO RELEASE SOON KNOW ABOUT TOP 5 CHANGES IN THIS YEAR RESULT SS GH

CBSE 12th Term 1 Results: త్వరలోనే సీబీఎస్‌సీ 12వ తరగతి టర్మ్‌ 1 ఫలితాలు... ఈసారి మార్పులివే

CBSE 12th Term 1 Results: త్వరలోనే సీబీఎస్‌సీ 12వ తరగతి టర్మ్‌ 1 ఫలితాలు... ఈసారి మార్పులివే
(ప్రతీకాత్మక చిత్రం)

CBSE 12th Term 1 Results: త్వరలోనే సీబీఎస్‌సీ 12వ తరగతి టర్మ్‌ 1 ఫలితాలు... ఈసారి మార్పులివే (ప్రతీకాత్మక చిత్రం)

CBSE 12th Term 1 Results | త్వరలోనే సీబీఎస్‌సీ 12వ తరగతి టర్మ్‌ 1 ఫలితాలు విడుదల కానున్నాయి. ఈసారి పలు మార్పులు ఉన్నాయి. ఆ మార్పులు ఏంటో, విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటో తెలుసుకోండి.

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) త్వరలోనే 12వ తరగతి పరీక్ష ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు వచ్చే వారంలోనే 12వ తరగతి సీబీఎస్‌సీ ఫలితాలు(Results) విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి సీబీఎస్‌సీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. పదో తరగతి టర్మ్‌ 1 ఫలితాలను ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా విడుదల చేసిన తరహాలోనే సీబీఎస్‌సీ 12వ తరగతి పరీక్ష ఫలితాలను కూడా సీబీఎస్‌సీ వెల్లడించే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది పరీక్షల ఫలితాలు చాలా ప్రత్యేకంగా నిలువనున్నాయి.

ఒకే ఏడాదిలో రెండు సార్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. టర్మ్‌ 1 ఫలితాలు (Term 1) ఇంకా విడుదల కాలేదు. అవి కూడా తుది పరీక్షల ఫలితాల్లో భాగంగానే ఉన్నాయి. టర్మ్‌ 1లో వచ్చిన మార్కులతో సంబంధం లేకుండానే విద్యార్థులు టర్మ్‌ 2 పరీక్షలు రాసే అవకాశం కల్పించారు.

NEET 2022: స్టేట్ బోర్డ్ విద్యార్థులు నీట్ ప్రిపేర్ కావడానికి చిట్కాలు.. ఏ సబ్జెక్ట్​లో ఎలాంటి టిప్స్ పాటించాలంటే?

సీబీఎస్‌సీ 12వ తరగతి టర్మ్‌ 1 ఫలితాలతో వచ్చే మార్పులు..


ఈ ఏడాది 10, 12వ తరగతుల పరీక్షలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ రెండు పర్యాయాలు నిర్వహిస్తోంది. 12వ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది రెండు పరీక్షలు ఉంటాయని, రెండు సార్లు ఫలితాలు విడుదల చేస్తామని సీబీఎస్‌సీ ముందే ప్రకటించింది. ప్రస్తుతానికి టర్మ్‌ 1 పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. టర్మ్‌2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారు. ఏప్రిల్‌ 26వ తేదీన సీబీఎస్‌సీ టర్మ్‌ 2 పరీక్షలు ప్రారంభమవుతాయి.

టర్మ్‌1, టర్మ్‌ 2 ఫలితాలు వేర్వేరుగా విడుదల అవుతాయి. టర్మ్‌1 ఫలితాలతో సంబంధం లేకుండా విద్యార్థులు టర్మ్‌ 2 పరీక్షలకు హాజరుకావచ్చు. అయితే తుది ఫలితాలను ప్రకటించే సమయంలో సీబీఎస్‌సీ 12వ తరగతి విద్యార్థుల టర్మ్‌ 1, టర్మ్‌2 ఫలితాలను కలిపి అందిస్తారు. రెండింటిలోనూ ఉత్తమ ఫలితాలు సాధించినవారే ముందు ఉంటారు.

LIC Recruitment 2022: టెన్త్ పాసైనవారికి ఎల్ఐసీలో జాబ్స్... త్వరలో ముగియనున్న దరఖాస్తు గడువు

సిలబస్‌ డివైడెడ్‌


సాధారణంగా బోర్డు పరీక్షలకు విద్యార్థులు అన్ని పాఠాలను చదవాల్సి ఉంటుంది. ఈ ఏడాది సీబీఎస్‌సీ సిలబస్‌ను రెండుగా విభజించింది. ఇది విద్యార్థులకు కాస్తంత వెసులుబాటును కల్పించింది. విభజించిన సిలబస్‌లో మొదటి 50 శాతం నుంచి టర్మ్‌ 1కు, రెండో భాగం నుంచి టర్మ్‌2కు ప్రశ్నలు అడుగుతారు. ఉత్తీర్ణతకు అవసరమైన మార్కులను కూడా మార్చారు. సీబీఎస్‌సీ విద్యార్థులకు కనీసం 33 శాతం మార్కులు వస్తే ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు. టర్మ్‌1 పరీక్షల్లో థియరీ పరీక్షకు 40 మార్కులు. అందులో పాస్‌ అవ్వాలంటే కనీసం 13 మార్కులు అవసరం. మొత్తం సిలబస్‌ను ఇప్పటికే 30 శాతానికి తగ్గించారు.

పాస్‌ లేదా ఫెయిల్‌ లేదు..


టర్మ్‌1 ఫలితాల ఆధారంగా విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారా? పాస్​ అయ్యారా?అనే అంశాలను వెల్లడించమని తెలిపారు. టర్మ్‌ 1, 2 ఫలితాల ఆధారంగా తుది ఫలితాల ప్రకటన ఉంటుంది. టర్మ్‌1లో సరైన ప్రదర్శన చేయలేదని భావించే వారికి టర్మ్‌ 2లో అవకాశం ఉంటుంది.

TCS Jobs: పీజీ పాసైనవారికి టీసీఎస్‌లో ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి

ఆన్‌లైన్‌లో మార్క్‌షీట్లు ఉండవు


గతేడాది తరహాలో పరీక్షల ఫలితాలను ఆన్‌లైన్‌లో ప్రకటించరు. టర్మ్‌ 1 ఫలితాలను నేరుగా ఆయా కళాశాలలకు పంపిస్తారు. టర్మ్‌ 2 ఫలితాలు కూడా వచ్చాక తుది ఫలితాలను విడుదల చేస్తారు. ఆన్‌లైన్‌లో, వెబ్‌సైట్‌లలో ఫలితాలు అందుబాటులో ఉండవు.

ఎగ్జామ్‌ ప్యాటర్న్‌లో మార్పులు


ఈ ఏడాది పరీక్ష విధానంలో మార్పు వచ్చింది. టూ టర్మ్‌ పద్ధతిని అమలు చేస్తున్నారు. టర్మ్‌ 1లో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇచ్చారు. టర్మ్‌ 2లో సబ్జెక్టివ్‌ తరహాలో పరీక్షలు జరుగుతాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Career and Courses, CBSE, Cbse results, Exams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు