సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. ఉత్తరప్రదేశ్ మహోబా జిల్లాలోని బడేరా గ్రామానికి చెందిన అన్సూయ అనే విద్యార్థిని 100 శాతం మార్కులు సాధించి అదుదైన ఘనత సాధించింది. అన్సూయా తల్లిందండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఆమెను కష్టపడి చదివించారు. తాము నిరక్షరాస్యులైనా తమ కూతురు ఉన్నతంగా చదువుకోవాలని నిరంతరం శ్రమించారు. తల్లిదండ్రుల కష్టాలు చూస్తూ పెరిగిన అన్సూయ చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్‌గా రాణించింది. బులంద్‌షహర్ జిల్లాలో విద్యాజ్ఞాన్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో సీటు దక్కించుకుంది. ఆ తర్వాత ప్రతి తరగతిలో మంచి మార్కులు సాధించుకుంటూ మెరిట్ స్టూడెంట్‌గా అందరి ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 100కు 100 పర్సంటైల్ సాధించింది. ఇంగ్లీష్, హిస్టరీ, జాగ్రఫీ, పెయింటింగ్, హిందీ ప్రతి సబ్జెక్టుల్లో 100 మార్కులు, పొలిటికల్ సైన్స్‌లో 99 మార్కులు సాధించింది.
Railway Jobs: రైల్వేలో 1664 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఖాళీల వివరాలు ఇవే
Rs 15 lakh prize money: మోదీ ప్రభుత్వం అద్భుత అవకాశం... రూ.15,00,000 గెలుచుకోండి ఇలా
తన కలలు, ఆకాంక్షల గురించి అన్సూయ మాట్లాడుతూ ‘‘నాకు జాగ్రఫీ, జర్నలిజం అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో ఐఏఎస్ అధికారిని కావాలని కోరుకుంటున్నాను. తద్వారా, మా ప్రాంత ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనేదే నా లక్ష్యం. మేము నివసించే బుందేల్‌ఖండ్ ఒక మారుమూల ప్రాంతం. ఇక్కడ మాకు అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఎప్పటికైనా తీర్చగలననే విశ్వాసం నాకుంది” అని తెలిపింది.
SBI Jobs 2021: ఎస్‌బీఐలో 6100 ఉద్యోగాలు... ఎంపిక చేసేది ఇలాగే
TCS National Qualifier Test: ఈ ఎగ్జామ్ రాయండి... కార్పొరేట్ కంపెనీలో జాబ్‌కి ట్రై చేయండి
‘‘కరోనా లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూసివేసి ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించారు. అయితే మా ప్రాంతంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు ఇంటర్నెట్ సౌకర్యం కూడా సరిగ్గా ఉండదు. పేదరికం వల్ల ల్యాప్‌టాప్ కూడా కొనలేని పరిస్థితి. దీంతో మా స్కూలు యాజమాన్యం వాట్సాప్‌లో స్టడీ మెటీరియల్‌ని పంపించేది. ఇలా నేను నెట్‌వర్క్ ఉన్న ప్రాంతానికి వెళ్లి మెటీరియల్‌ను డౌన్‌లోడ్ చేసుకొని చదువుకున్నాను.ఈ ప్రిపరేషన్‌తోనే ప్రీ-బోర్డ్ పరీక్షలకు హాజరయ్యాను. నాకు మంచి స్కోర్ వస్తుందనే నమ్మకం ఉండేది. కానీ 100 శాతం మార్కులు వస్తాయని అస్సలు ఊహించలేదు” అని వివరించి అన్సూయ. కాగా, తమ గ్రామంలో సౌకర్యాలు సరిగ్గా లేవని, వాటిని మెరుగుపర్చాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, CBSE, CBSE Board Exams 2021, EDUCATION, Results