CBSE Exams: ఆ పరీక్షలకు తేదీలు ఖరారు చేసిన సీబీఎస్ఈ.. రూల్స్ ఇవే..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్ష తేదీలను శనివారం విడుదల చేసింది.

news18-telugu
Updated: November 22, 2020, 9:16 AM IST
CBSE Exams: ఆ పరీక్షలకు తేదీలు ఖరారు చేసిన సీబీఎస్ఈ.. రూల్స్ ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్ష తేదీలను శనివారం విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 8 వరకు ఈ పరీక్షలను జరపనున్నట్టు తెలిపింది. అయితే పరీక్షల నిర్వహణకు సంబంధించిన కచ్చితమైన తేదీలను త్వరాత వెల్లడిస్తామని పేర్కొంది. అలాగే ఈ పరీక్షలు నిర్వహించడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను(SOP)జారీచేసింది. పరీక్షలకు సంబంధించి వేర్వేరు తేదీలను పాఠశాలలకు పంపనున్నట్టు బోర్డు తెలిపింది. ప్రాక్టికల్ పరీక్షలను బోర్డు తరఫున నియమించబడిన అబ్జర్వర్స్ పర్యవేక్షించనున్నారని చెప్పింది. గతేడాది‌లాగే ఈ సారి కూడా ప్రాక్టికల్ పరీక్షల్లో ఇంటర్నల్, ఎక్స్‌ట్ర‌న‌ల్ రెండు ఉంటాయని వెల్లడించింది.

సీబీఎస్‌ఈ నియమించిన ఎక్స్‌ట్రనల్ ఎగ్జామినర్ ఆధ్వర్యంలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడం పాఠశాలల బాధ్యత అని తెలిపింది. పరీక్షలు పూర్తయిన తర్వాత పాఠశాలలు తమకు కేటాయించిన లింక్ ద్వారా మార్క్‌లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రతి పాఠశాలకు యాప్ లింక్ అందజేస్తామని అందులో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ప్రతి బ్యాచ్ విద్యార్థుల గ్రూప్ ఫొటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని బోర్డు తెలిపింది. ప్రతి బ్యాచ్‌లో పరీక్షకు హాజరైన విద్యార్థులతో పాటు ఎక్స్‌ట్రనల్ ఎగ్జామినర్, ఇంటర్నల్ ఎగ్జామినర్, అబ్జర్వర్ కూడా ఆ ఫొటోలో ఉండాలని సూచించింది. ఫొటోలో ప్రతి ఒక్కరి ముఖం తప్పకుండా కనిపించే విధంగా చూడాలని ఆదేశించింది.

ఇక, సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలను తప్పకుండా నిర్వహిస్తామని బోర్డు సెక్రటరీ అనురాగ్ త్రిపాఠి శుక్రవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. పరీక్షలు గతేడాది ఫార్మాట్ లోనే ఉంటాయా? లేదా? అన్న అంశంపై సైతం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. పరీక్షలు ఫిబ్రవరి, మార్చిలోనే ఉంటాయా లేక ఆలస్యంగా నిర్వహిస్తారా అన్న అంశంపై ఇంకా సీబీఎస్ఈ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
Published by: Sumanth Kanukula
First published: November 22, 2020, 9:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading