హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Term 1 Results: సీబీఎస్ఈ టర్మ్ 1 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

CBSE Term 1 Results: సీబీఎస్ఈ టర్మ్ 1 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సీబీఎస్ఈ బోర్డ్ టర్మ్ 1 ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

  సీబీఎస్ఈ(CBSE) బోర్డ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. 10వ తరగతికి సంబంధించి టర్మ్-1 ఫలితాలను విడుదల చేసినట్లు ప్రకటించింది. అయితే విద్యార్థుల మార్క్ షీట్ లను వారి స్కూళ్లకు పంపించినట్లు బోర్డు వెల్లడించింది. విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవడానికి స్కూళ్లను సంప్రదించాలని బోర్డు సూచించింది. అయితే త్వరలో 12వ తరగతికి సంబంధించిన ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://cbseresults.nic.in/  లో ఇంకా విడుదల చేయలేదు సీబీఎస్ఈ బోర్డ్. ఆ ఫలితాలను త్వరలో ప్రకటిస్తామని బోర్డ్ వెల్లడించింది. గతేడాది నవంబర్-డిసెంబర్‌లో సీబీఎస్ఈ బోర్డ్ 10, 12 తరగతి టర్మ్-1 పరీక్షలను నిర్వహించింది. ఈ ఎగ్జామ్స్ కు మొత్తం 36 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

  ఫలితాలు అధికారిక వెబ్ సైట్లో విడుదలైన అనంతరం విద్యార్థులు రోల్ నంబర్, స్కూల్ నంబర్లను నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ముందుగానే తెలుసుకోవాలంటే తమ స్కూళ్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫలితాలు విదుడైలన అనంతరం results.gov.in, digilocker.gov.in వెబ్ సైట్లలోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయని సీబీఎస్ఈ బోర్డు వెల్లడించింది.

  CBSE Class 10 Maths: సీబీఎస్ఈ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. టర్మ్-2 మాథ్స్ సిలబస్ ఇదే

  ఇదిలా ఉంటే.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవల కీలక ప్రకటన చేసింది. 10, 12వ తరగతుల టర్మ్ 2 ఎగ్జామ్స్ కు సంబంధించిన డేట్ షీట్లను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్స్ ఏప్రిల్ 26 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపింది. క్లాస్ 10 పరీక్షలు మే 24న ముగియనుండగా.. క్లాస్ 12 ఎగ్జామ్స్ జూన్ 15న ముగియనున్నాయి. ఈ ఎగ్జామ్స్ ను 26 దేశాల్లో నిర్వహించనుంది సీబీఎస్ఈ. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉదయం 10.30 గంటలకు ఎగ్జామ్స్ ను ప్రారంభించనుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా పరీక్షల తేదీల మధ్య గ్యాప్ పెంచారు అధికారులు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Career and Courses, CBSE, Cbse results, Exams

  ఉత్తమ కథలు