సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి ఫలితాలు ఈ రోజు (జులై 4) విడుదల కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం CBSE 10th టర్మ్ 2 పరీక్షల ఫలితాలు జూలై 4 (సోమవారం).. 12వ తరగతి ఫలితాలు జూలై 10న విడుదలయ్యే అవకాశం ఉందని విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే.. సీబీఎస్ఈ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి టర్మ్ 2 బోర్డు పరీక్ష ఫలితాలు నేడు విడుదల చేయనున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం 12వ తరగతి ఫలితాలకు సంబంధించి మూల్యాంకన ప్రక్రియ జరుగుతోందని, ఫలితాల తేదీ మరియు సమయాన్ని త్వరలో వెల్లడిస్తామని CBSE పరీక్షల నియంత్రణాధికారి సన్యామ్ భరద్వాజ్ తెలిపారు.
జూలై 10న ఈ ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సీబీఎస్ఈ టర్మ్ 1,2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా 12వ తరగతి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ పరీక్ష ఫలితాలను cbseresults.nic.in, results.gov.in, parikshasangam.cbse.gov.in మరియు ఇతర వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చు. గత అకడమిక్ నుంచే 10వ తరగతి పరీక్షలను టర్మ్ 1, టర్మ్ 2లుగా నిర్వహించారు. ఇలా చేయడానికి కారణం విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకే అని బోర్డ్ భావించింది. ఏప్రిల్ లోనే టర్మ్ 1 ఫలితాలను విడుదల చేసిన బోర్ట్ నేడు 10వ తరగతి విద్యార్థుల టర్మ్ 2 ఫలితాలు విడుదల చేయనుంది. CBSE టర్మ్ 2 క్లాస్ 10 పరీక్షలు ఏప్రిల్ 26 నుండి మే 24 వరకు మరియు 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుండి జూన్ 15 వరకు జరిగాయి. బోర్డు తన అధికారిక సోషల్ మీడియా పేజీలలో ఫలితాల తేదీ మరియు సమయాన్ని ప్రకటిస్తుంది. CBSE క్లాస్ 10, క్లాస్ 12 ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు వారి బోర్డు పరీక్ష రోల్ నంబర్లు , స్కూల్ కోడ్‌లతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
ఇంటర్నల్ అసెస్‌మెంట్ లేదా ప్రాక్టికల్ స్కోర్లు పాఠశాలల్లో అందుబాటులో ఉన్నందున థియరీ పరీక్షలకు సంబంధించి స్కోర్లను మాత్రమే తెలియజేస్తున్నాట్లు సీబీఎస్‌ఈ (CBSE) పేర్కొంది. ఇక టర్మ్ 1 మరియు టర్మ్ 2 పరీక్షలకు సంబంధించి ఫలితాలు మొత్తం ఒకే మార్క్ షీట్ ను పొందనున్నారు. ఈ మార్క్ షీట్ లు 2021 లేదా అంతకంటే ముందు సంవత్సరం తరహాలో ఉంటాయని పేర్కొన్నారు. సీబీఎస్ఈ 10వ తరగతికి సంబంధించిన స్కూల్ కోడ్ సెషన్ 2021-22కి సంబంధించిన టర్మ్ 2 పరీక్ష పనితీరును అటాచ్‌మెంట్‌లో చూసుకోవాలని సీబీఎస్‌ఈ(CBSE) రిపోర్ట్‌లో పేర్కొంది.
ఈ సీబీఎస్ఈ టర్మ్ 2 నమూనా పేపర్, మార్కింగ్ విధానం పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచింది. గత 5 సంవత్సరాలలో CBSE బోర్డు ఫలితాలు ఇలా ఉన్నాయి. 2021- 99.04% , 2020- 91.46% , 2019- 91.10% , 2018- 86.7% , 2017- 93.12శాతంగా ఉన్నాయి. CBSE 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలంటే.. విద్యార్థులు ఒక సబ్జెక్టులోని థియరీ మరియు ప్రాక్టికల్ కాంపోనెంట్స్ రెండింటిలోనూ కనీసం 33% సాధించాలి.
CBSE బోర్డుకు సంబంధించి మరికొన్ని వివరాలిలా.. మొత్తం పాఠశాలలు 22,732 ఉండగా.. మొత్తం కేంద్రాలు 7,406 ఉన్నాయి. మహిళా అభ్యర్థులు 8,94,993, పురుష అభ్యర్థులు 12,21,195, ఇతరులు 21 ఉండగా.. మొత్తం అభ్యర్థులు 21,16,209 ఉన్నారు. సీబీఎస్ఈ టర్మ్ 2 పరీక్షలకు దాదాపు 3.50 లక్షల మంది హాజరయ్యారు. బోర్డు ఐదు సబ్జెక్టులకు ఉత్తీర్ణత ప్రమాణాలను కలిగి ఉంది. CBSE 10వ తరగతి విద్యార్థికి ఐదు తప్పనిసరి సబ్జెక్టులు ఉన్నాయి. 2 భాషలు (ఇంగ్లీష్, హిందీ, లేదా ఏదైనా ప్రాంతీయ / విదేశీ భాష) మరియు 3 కోర్ సబ్జెక్టులు (గణితం, సైన్స్ మరియు సామాజిక). విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి లేదా వీటన్నింటిలో 33 శాతం స్కోర్ చేయాలి. అదనంగా, విద్యార్థులు ఏదైనా ఎంపిక/వృత్తి సంబంధిత సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, CBSE, Cbse results, Education CBSE, JOBS