• Home
  • »
  • News
  • »
  • jobs
  • »
  • CBSE 10TH RESULT 2021 WILL BE RELEASED SOON MARKS WILL BE CALCULATED WITH THIS PROCEDURE NS GH

CBSE 10th Results: త్వరలో సీబీఎస్​ఈ పదో తరగతి ఫలితాలు.. మార్కులు ఎలా కేటాయిస్తారంటే..

ప్రతీకాత్మక చిత్రం

సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. అయితే ఫలితాలను ఎలా లెక్కిస్తారన్న అంశంపై విద్యార్థులకు అనేక సందేహాలు ఉన్నాయి. వారి కోసం ఈ వివరాలు..

  • Share this:
కరోనా కారణంగా రద్దయిన సీబీఎస్ఈ (CBSE) పదో తరగతి ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. మార్కుల లెక్కింపు విషయంలో బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. లెక్కింపు కోసం ప్రత్యేకమైన పద్ధతిని పాటిస్తోంది. మార్కుల కేటాయింపునకు తీవ్ర కసరత్తులు చేస్తోంది.  సీబీఎస్​ఈ పదో తరగతి విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు 100 మార్కులకు లెక్కింపు జరగనుంది. ఇంటర్నల్​ అసెస్​మెంట్​ కోసం 20 మార్కులను కేటాయించనుంది. ప్రాక్టికల్స్​, ప్రాజెక్టు వర్క్​ల ఆధారంగా ఈ మార్కులను వేయనుంది. అలాగే ఏడాది మొత్తం మీద నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకొని మిగిలిన 80 మార్కులను నిర్ణయించనుంది. పీరియాడిక్​/ యూనిట్​ టెస్టులకు 10 మార్కులు, అర్ధ సంతవత్సరం/ మిడ్ టర్మ్​ పరీక్షలకు 30 మార్కులు, ప్రీబోర్డు పరీక్షల్లోని 40 మార్కుల్లో విద్యార్థులు ఎన్ని సాధించారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫైనల్ మార్కులను ప్రకటించనున్నారు. ఒకవేళ విద్యార్థులు పాస్​ మార్కుల కంటే తక్కువ తెచ్చుకుంటే.. గ్రేస్ మార్కులను ఇస్తారు.
Telangana Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు.. కరోనా నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే

-ఒకవేళ గ్రేస్ మార్కులు వేసినా విద్యార్థులు క్వాలిఫై​ కాలేకపోతే.. ఆ తర్వాత వారిని ఎసెన్షియల్ రిపీట్​, కంపార్ట్​మెంట్​ కేటగిరీలో ఉంచుతారు. ఒకవేళ విద్యార్థులెవరైనా తమ మార్కులతో సంతృప్తి చెందకపోతే కరోనా పరిస్థితులు సద్దుమణిగాక సీబీఎస్​ఈ మళ్లీ పరీక్షలు నిర్వహించనుంది.
NTPC Recruitment 2021: NTPCలో 280 ఉద్యోగాలు.. ఆ మార్కుల ద్వారానే అభ్యర్థుల ఎంపిక.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

-విద్యార్థుల మార్కులను లెక్కించేందుకు ప్రిన్సిపల్​, ఏడుగురు టీచర్లతో ప్రతీ స్కూల్​ కమిటీని నియమించాలని సీబీఎస్​ఈ ఆదేశించింది. కాగా ఇంటర్నల్ అసెస్​మెంట్ మార్కులను సమర్పించేందుకు ఇచ్చిన గడువును ఇటీవల సీబీఎస్​ఈ పొడిగించింది. ఈ నెల 30వ వరకు గడువిచ్చింది. మొత్తం 21.5 లక్షల విద్యార్థులు 2021లో సీబీఎస్​ పరీక్షల కోసం నమోదు ​చేసుకున్నారు.

-అలాగే ప్రైవేటుగా నమోదు చేసుకున్న 10వ తరగతి విద్యార్థులకు కూడా మార్కుల లెక్కింపు విధానాన్ని రూపొందించాలని సీబీఎస్ఈ​కి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రైవేటుగా పరీక్ష కోసం నమోదు చేసుకున్న విద్యార్థుల కోసం సీబీఎస్​ఈ మార్కుల లెక్కింపునకు చర్యలు తీసుకోవడం లేదంటూ న్యాయస్థానంలో పిటిషిన్ దాఖలు కాగా.. విచారణ జరిగింది. ఈ మేరకు మే 31న హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

-మరోవైపు 12వ తరగతి పరీక్షలను కూడా సీబీఎస్​ఈ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయించాలన్న విషయంపైనా కసరత్తులు చేస్తోంది. అయితే ఇంకా విధివిధానాలను రూపొందించలేదు. త్వరలోనే 12వ తరగతి మార్కుల విషయంపైనా ప్రకటన వెలువడే అవకాశముంది.
Published by:Nikhil Kumar S
First published: