CBSE 10th Result 2019: విడుదలైన సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు...

ఫిబ్రవరి 2 నుంచి మార్చి 29వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

news18-telugu
Updated: May 6, 2019, 4:40 PM IST
CBSE 10th Result 2019: విడుదలైన సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 6, 2019, 4:40 PM IST
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు www.cbseresults.nic.in లేదా www.cbse.nic.in అనే వెబ్‌సైట్‌లలో తమ ఫలితాలు చూసుకోవచ్చని సీబీఎస్‌ఈ ప్రకటించింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 29వ తేదీ వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులు  హాజరు కాగా, మొత్తం 91.1 శాతం మంది పాసయ్యారు. గత ఏడాది పాస్ పర్సంటేజీ 86.07 శాతంగా ఉంది. సీబీఎస్ఈ పదో తరగతి-2019 ఫలితాలను ఇతర వెబ్‌సైట్లు అయిన examresults.in, indiaresults.com, results.gov.inలోనూ చెక్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది తెలంగాణ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర బోర్డుల కంటే ముందే సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలను వెల్లడించింది. కాగా, ఫలితాలపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16 లోగా 1800 11 8004 నంబరును సంప్రదించవచ్చు. ఇదిలా ఉండగా, ఫలితాల డిజిటల్ సర్టిఫికెట్లను www.digilocker.gov.inలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫలితాలు చెక్ చేసుకోండిలా..


కాగా,సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాలు గురువారం రిలీజయ్యాయి. ఆ పరీక్షల్లో 83.4% శాతం పాసైనట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 13 లక్షల మంది సీబీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలు రాశారు. 10, 12 తరగతులకు మొత్తం 31,14,821 మంది నమోదు చేసుకున్నారు. ఐతే మే నెల మూడో వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినా... కొన్ని కారణాల వల్ల ముందే విడుదల చేశారు.

ఇది కూడా చదవండి:-

సీబీఎస్ఈ ఫలితాలు: 13 మంది విద్యార్థులకు 499/500.. మరిన్ని రికార్డులు..

సీబీఎస్ఈ ఫలితాలు: మరో సారి ఖుషీ అవుతున్న స్మృతి ఇరానీ
First published: May 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...