CBSE Alert: విద్యార్థులు సబ్జెక్ట్స్ మార్చుకోవడానికి జూలై 15 వరకే గడువు

CBSE Subject Change | చాలామంది విద్యార్థులు సబ్జెక్ట్స్ మార్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వారికి సీబీఎస్ఈ అవకాశం కల్పిస్తోంది.

news18-telugu
Updated: July 2, 2019, 5:15 PM IST
CBSE Alert: విద్యార్థులు సబ్జెక్ట్స్ మార్చుకోవడానికి జూలై 15 వరకే గడువు
CBSE Alert: విద్యార్థులు సబ్జెక్ట్స్ మార్చుకోవడానికి జూలై 15 వరకే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సీబీఎస్ఈ 10, 12వ తరగతి 2020 బోర్డ్ పరీక్షల నిర్వహణకు కసరత్తు మొదలుపెట్టింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ఈ ప్రక్రియ మొదలుపెట్టనుంది. అయితే అంతకంటే ముందే 10, 12వ తరగతి విద్యార్థులు తమ సబ్జెక్స్ మార్చుకోవడానికి జూలై 15 వరకు గడువు ఇచ్చింది సీబీఎస్ఈ. చాలామంది విద్యార్థులు సబ్జెక్ట్స్ మార్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వారికి సీబీఎస్ఈ అవకాశం కల్పిస్తోంది. ఏవైనా మార్పుచేర్పులు ఉంటే వీలైనంత త్వరగా తెలపాలని ఇప్పటికే అనుబంధంగా నడుస్తున్న స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేసింది సీబీఎస్ఈ. జూలై 15 లోగా విద్యార్థులు సబ్జెక్ట్స్ మార్చుకుంటే, ఆ వివరాలను సీబీఎస్ఈకి జూలై 21 లోగా సమర్పించనున్నాయి స్కూళ్లు.

సబ్జెక్ట్స్ మార్పు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే...


సబ్జెక్ట్ మార్పు కోరుతూ విద్యార్థి లేదా వారి తల్లిదండ్రుల దరఖాస్తు ఫామ్.

ఒకే స్కూల్‌లో అయితే ముందు తరగతి రిపోర్ట్ కార్డ్.
ఒకవేళ స్కూల్ మారితే గతంలో చదివిన స్కూల్ టీసీ, రిపోర్ట్ కార్డ్.
ఆరోగ్య కారణాలైతే ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మెడికల్ సర్టిఫికెట్.


ఇతర కారణాలేవైనా ఉంటే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్.
Loading...
సబ్జెక్ట్ మార్పు చేసుకోవడానికి ముందు సీబీఎస్ఈ అధికారిక నోటీస్ పూర్తిగా చదవడం మంచిది.
సబ్జెక్ట్ మార్చుకోవాలనుకుంటే స్కూల్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

SBI Student Loan: ఎస్‌బీఐ నుంచి ఎడ్యుకేషన్ లోన్... పొందండి ఇలా

Railway Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

CRPF Jobs: సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: July 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...