Home /News /jobs /

CBSE 10TH 12TH TERM 1 RESULT DELAYED CHECK EXPECTED DATE STEP TO DOWNLOAD MARKSHEET CBSE NIC IN GH VB

CBSE Term1 Result: సీబీఎస్‌సీ 10, 12వ తరగతుల టర్మ్‌1 రిజల్ట్స్‌ ఆలస్యం.. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

10వ తరగతి, 12వ తరగతి విద్యార్థుల టర్మ్‌ 1 పరీక్షల (Term1 Exams) ఫలితాలను త్వరలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆప్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(CBSE) విడుదల చేయనుంది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ రిజల్ట్స్‌ను సీబీఎస్‌సీ విడుదల చేసే అవకాశం ఉంది.

10వ తరగతి, 12వ తరగతి విద్యార్థుల టర్మ్‌ 1 పరీక్షల (Term1 Exams) ఫలితాలను త్వరలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆప్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(CBSE) విడుదల చేయనుంది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ రిజల్ట్స్‌ను సీబీఎస్‌సీ విడుదల చేసే అవకాశం ఉంది. అయితే పరీక్ష ఫలితాలకు (Exam Result) సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. సీబీఎస్‌సీ టర్మ్‌ 1 పరీక్షలు గతేడాది డిసెంబరులో పూర్తయ్యాయి. దాదాపు దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాలను సీబీఎస్‌సీ విడుదల చేసిన తర్వాత.. విద్యార్థులు cbseresults.nic.in లేదా cbse.nic.in లో చూసుకోవచ్చు.

Investing For Retirement: రిటైర్‌మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసే ముందు హోమ్ లోన్ క్లియర్ చేయాలా..? నిపుణుల సూచనలు ఇవే..


పరీక్షల ఫలితాల విడుదలలో జాప్యానికి (Delayed) వివిధ కారణాలు ఉన్నాయి. జవాబు పత్రాలు దిద్దే ప్రక్రియలో చోటుచేసుకొన్న మార్పుల కారణంగా రిజల్ట్ ఆలస్యమవుతోంది. టర్మ్‌1 పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్షలు జరిగిన రోజే ఆ పరీక్షకు సంబంధించిన జబాబు పత్రాలను దిద్దవద్దని సీబీఎస్‌సీ అన్ని పాఠశాలలకు ఆదేశాలు పంపింది. అదే విధంగా పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి కూడా సీబీఎస్‌సీకి పలు ఫిర్యాదులు అందాయి. కొన్ని పాఠశాలల్లో పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, కొందరు పరీక్షలో ఛీటింగ్‌ చేశారని బోర్డు దృష్టికి వచ్చింది.

అయితే సీబీఎస్‌సీకి వచ్చిన ఫిర్యాదుల్లో వాస్తవం ఎంత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పరీక్షలు అన్ని చోట్ల సక్రమంగా జరిగాయా? లేదా? అని నిర్ధారించుకొనే పనిలో సీబీఎస్‌సీ నిమగ్నమైంది. ఈ కారణంగానే ఫలితాల ప్రకటనను ఆపింది. అన్ని పూర్తయిన తర్వాత అంతా సవ్యంగానే ఉందని తేలిన తర్వాత పరీక్షల ఫలితాలను ప్రకటించే యోచనలో ఉంది.

ఫలితాలను చూసుకొనేందుకు 10, 12వ తరగతి విద్యార్థులకు పలు వెబ్‌సైట్‌లు, మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా సీబీఎస్‌సీ 2021 టర్మ్‌1 పరీక్ష ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఇందుకు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్..

1.సీబీఎస్‌సీ అఫీషియల్ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి.

2. ఏ తరగతి ఫలితాలు కావాలో సెలెక్ట్‌ చేసి, రోల్‌ నంబరు, ఎగ్జామ్‌ సెంటర్‌ పేరు, పుట్టిన తేది వంటి అవసరమైన వివరాలు ఎంటర్‌ చేయాలి.

3. తర్వాత సబ్మిట్‌ బటన్‌ క్లిక్‌ చేస్తే పరీక్ష ఫలితాలు కనిపిస్తాయి.

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 సిలబస్‌పై స్పష్టతనిచ్చిన ఐఐటీ బాంబే.. వివరాలిలా..


ఉమాంగ్‌ యాప్‌ ద్వారా పరీక్ష ఫలితాలు చెక్ చేసుకునే ప్రాసెస్..
సీబీఎస్‌సీ పరీక్షల ఫలితాలు ప్రకటించిన రోజు సర్వర్‌పై ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఒకే సమయంలో ఎక్కువ మంది పరీక్షల ఫలితాలు చూడటానికి ప్రయత్నించడంతో వెబ్‌సైట్‌ కొంచెం స్లోగా పనిచేయవచ్చు. ఇలా ఇప్పటికి చాలా సార్లు జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యమ్నాయ మార్గమైన ఉమాంగ్‌ యాప్‌ ద్వారా రిజల్ట్‌ తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ యాపిల్‌ యాప్‌ స్టోర్‌, గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.

డిజిలాకర్‌ ద్వారా సీబీఎస్‌సీ 2021 టర్మ్‌1 బోర్డ్‌ పరీక్ష ఫలితాలు
ప్రభుత్వానికి చెందిన డిజిటల్‌ ప్లాట్‌ఫార్మ్‌ డిజిలాకర్‌ ద్వారా కూడా సీబీఎస్‌సీ ఫలితాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు digilocker.gov.in వెబ్‌సైట్‌ను అయినా సంప్రదించవచ్చు లేదా యాప్‌ను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇటీవల సీబీఎస్‌సీ బోర్టు టర్మ్‌ 2 పరీక్షల నిర్వహణ తేదీని వెల్లడించింది. ఏప్రిల్‌ 26న పరీక్షలు మొదలవుతాయి. సీబీఎస్‌సీ రెండు టర్ములుగా విద్యాసంవత్సరాన్ని విభజించింది. టర్మ్‌ 1 పరీక్షల్లో ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. టర్మ్‌ 2లో పరీక్షలు సబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. మల్టిపుల్‌ ఛాయిస్‌, షార్ట్‌, లాంగ్‌ ఆన్సర్‌ ప్రశ్నలు ఉంటాయి.

టర్మ్‌1 ఫలితాలే కాకుండా 2021 సెంట్రల్‌ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌(CTET) ఫలితాలు కూడా త్వరలో విడుదల కానున్నాయి. ఈ రిజల్ట్స్‌ను ctet.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. గతేడాది డిసెంబరు 16 నుంచి జనవరి 13వరకు జరిగిన పరీక్షలను దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు రాశారు.
Published by:Veera Babu
First published:

Tags: CBSE, CBSE Board Exams 2021, Exam results

తదుపరి వార్తలు