హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBSE Board Exams 2022 : విద్యార్థుల‌కు సీబీఎస్ఈ ప్ర‌త్యేక అవ‌కాశం.. ప‌రీక్ష కేంద్రాన్ని ఎంచుకోవ‌చ్చు

CBSE Board Exams 2022 : విద్యార్థుల‌కు సీబీఎస్ఈ ప్ర‌త్యేక అవ‌కాశం.. ప‌రీక్ష కేంద్రాన్ని ఎంచుకోవ‌చ్చు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

CBSE Board Exams 2022 : త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న సీబీఎస్ఈ బోర్డు 10, 12వ ట‌ర్మ్ -1 ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థుల‌కు ప్ర‌త్యేక స‌దుపాయాన్ని అందించ‌నుంది. విద్యార్థులు వారికి న‌చ్చిన సెంట‌ర్‌ను ఎంచుకోవ‌చ్చ‌ని తెలిపింది. అతి త్వ‌ర‌లో ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ విండో యాక్టీవ్ చేస్తామ‌ని సీబీఎస్ఈ తెలిపింది.

ఇంకా చదవండి ...

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (Central Board of Secondary Education) తన బోర్డ్ పరీక్షలను 2022 నవంబర్ 30, 2021 నుంచి 10 వ తరగతి పరీక్షలు నిర్వ‌హిస్తోంది. తరువాత నవంబర్ 12, 2021 నుంచి 12 వ తరగతి పరీక్షలను నిర్వ‌హించ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప‌రీక్షా కేంద్రాల‌ (Exam Centers) ను విద్యార్థులు వారి నివాస ప్రాంతాన్ని బ‌ట్టి వారి సౌల‌భ్యం కోసం ప‌రీక్షా కేంద్రాన్ని మార్చుకొనే వెసులుబాటు ఇచ్చింది. చాలా కాలంగా ఆన్‌లైన్ (Online) త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో ప‌లువురు విద్యార్థులు (Students) త‌మ ప్ర‌దేశాన్ని మార్చుకొన్నారు. ఈ నేప‌థ్యంలో వారి స‌మ‌స్య‌ను దృష్టిలో పెట్టుకొని సీబీఎస్‌ఈ (CBSE) విద్యార్థుల‌కు ప‌రీక్షా కేంద్రాన్ని మార్చుకొనే అవ‌కాశం ఇచ్చింది.

త్వ‌ర‌లో ప‌రీక్ష‌కేంద్రం ఎంచుకొనే అవ‌కాశం

కొంతమంది విద్యార్థులు తమ పాఠశాల నగరంలో అడ్మిషన్ (Admission) తీసుకున్న వారు ఇంకా ఎక్కడో నివసిస్తున్నట్టు బోర్డు దృష్టికి వచ్చింద‌ని సీబీఎస్ఈ తెలిపింది. విద్యార్థుల‌కు స‌మ‌యం తేదీ అవ‌కాశం ఇస్తాం. ప‌రీక్షా కేంద్రాన్ని మార్చ‌మ‌ని సంబంధిత పాఠ‌శాల‌కు అభ్య‌ర్థ‌నును పెట్టుకోవ‌చ్చు.

 IIT Madras : ఐఐటీలో డేటా సైన్స్ కోర్సు చేయాల‌నుకొంటున్నారా.. అయితే ద‌ర‌ఖాస్తు చేసుకోండి


ఇది ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. సీబీఎస్ఈకీ ఆన్‌లైన్ రిక్వెస్ట్‌ (Online Request) ను సూచ‌న‌ల మేర‌కు అందించాల‌ని బోర్డు పేర్కొంది.  పరీక్ష నగరాన్ని మార్చడానికి విండో త్వరలో ప్రారంభిస్తామ‌ని బోర్డు పేర్కొంది. అయితే ఆ తేదీల‌ను ఇంకా బోర్డు వెల్ల‌డించ‌లేదు.

10 వ తరగతి టర్మ్​ -1 పరీక్షలు నవంబర్ 30..

10 వ తరగతి టర్మ్​ -1 పరీక్షలు నవంబర్ 30 (November 30) న ప్రారంభమై డిసెంబర్ 11 న ముగుస్తాయి, అయితే  12 వ తరగతి పరీక్షలు డిసెంబర్ 1 న ప్రారంభమై డిసెంబర్ 22 న ముగుస్తాయి. రెండవ టర్మ్ పరీక్ష మార్చి-ఏప్రిల్ 2022 లో నిర్వహించబడుతుంది మరియు ఇది ఆబ్జెక్టివ్ లేదా సబ్జెక్టివ్​ విధానం (subjective-type)​ అనేది దేశంలోని కోవిడ్ పరిస్థితి (covid situation)పై ఆధారపడి ఉంటుంది.  విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్- cbse.gov.in లో డేట్​ షీట్​ (date sheet)​ను డౌన్​లోడ్ (download)​ చేసుకోవచ్చు.

ముఖ్య‌ వివ‌రాలు..

- CBSE 12 వ తరగతిలో 114 సబ్జెక్టుల ఉన్నాయి. 10 వ తరగతిలో 75 సబ్జెక్టులు ఉన్నాయి.

- బోర్డు మొత్తం 189 సబ్జెక్టుల పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది.

NEET 2021 Results : దీపావ‌ళికి ముందే నీట్ 2021 ఫ‌లితాలు.. క‌ట్ఆఫ్ అంచ‌నా వివ‌రాలు


- ట‌ర్మ్‌- అబ్జెక్టీవ్ విధానం.. ట‌ర్మ్ - 2 రాత పూర్వ‌క ప‌రీక్ష‌లు

- కోవిడ్ -19 పరిస్థితిని బట్టి రెండు గంటల వ్యవధిలో నిర్వహించబడతాయి.

- శీతాకాలం దృష్ట్యా పరీక్షలు ఉదయం 10.30 కి బదులుగా 11.30 నుంచి ప్రారంభమవుతాయి.

అన్ని ప‌రీక్ష నిర్వ‌హిస్తే ఎక్కువ రోజుల స‌మ‌యం..

సీబీఎస్ఈలో మొత్తం సబ్జెక్టుల పరీక్ష నిర్వహిస్తే, పరీక్షల మొత్తం వ్యవధి కనీసం 40-45 రోజులు ఉంటుంది. అన్ని సబ్జెక్టుల పరీక్ష నిర్వహిస్తే, పరీక్షల మొత్తం వ్యవధి కనీసం 40-45 రోజులు ఉంటుంది. అందువల్ల, విద్యార్థుల అభ్యాస నష్టాన్ని నివారించడానికి, సీబీఎస్ఈ (CBSE) అందించే సబ్జెక్టులను రెండు భాగాలుగా విభజించాలని CBSE నిర్ణయించింది. అదే ప్ర‌ధాన స‌బ్జెక్టులు, మైన‌ర్ స‌బ్జెక్టులు సీబీఎస్ఈ అనుబంధ పాఠ‌శాల‌లు అన్ని ఈ షీట్ విధానం ద్వారా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది.

First published:

Tags: CBSE Board Exams 2021, EDUCATION, Exams

ఉత్తమ కథలు