CBSE 10TH 12TH BOARD EXAM 2022 ADMIT CARD ON NOVEMBER 9 EXAMS FROM NOVEMBER 16 CBSE NIC IN GH VB
Changes In Exams: ఆ బోర్డు ద్వారా నిర్వహించే 10, 12 పరీక్షల్లో కీలక మార్పులు.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
Changes In Exams: నూతన విద్యావిధానానికి అనుగుణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సమూల మార్పులు చేసింది. సీబీఎస్ఈ పదో తరగతి, పన్నెండో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారమే నవంబర్ 16 నుండి 10వ తరగతి, 12వ తరగతి టర్మ్ 1 బోర్డు పరీక్షలను నిర్వహించనుంది.
నూతన విద్యావిధానానికి అనుగుణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సమూల మార్పులు చేసింది. సీబీఎస్ఈ పదో తరగతి, పన్నెండో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారమే నవంబర్ 16 నుండి 10వ తరగతి, 12వ తరగతి టర్మ్ 1 బోర్డు పరీక్షలను నిర్వహించనుంది. ఈ టర్మ్ 1 పరీక్షలను MCQ ఫార్మాట్లో నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ సమాధానాలను గుర్తించడానికి కాగితంపై ఇచ్చిన సర్కిల్లను పూరించాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్లను సీబీఎస్ఈ పరిధిలోని అన్ని పాఠశాలలకు అందజేస్తుంది.
టర్మ్-1 పరీక్షలు 90 నిమిషాల పాటు జరుగుతాయి. కేవలం సగం సిలబస్‌పై మాత్రమే టర్మ్ 1 పరీక్ష ఉంటుంది. టర్మ్-II పరీక్షలను మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఈ టర్మ్-II పరీక్షలు సబ్జెక్టివ్ ఫార్మాట్లో ఉంటాయి. కాగా, సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థులకు 114 సబ్జెక్టులను, 10వ తరగతికి 75 సబ్జెక్టులను ఆఫర్ చేస్తోంది. మెయిన్ సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ అన్ని పరీక్షలను నిర్వహించేందుకు 40 నుంచి -45 రోజుల వ్యవధి పడుతుంది.
CBSE is offering 114 subjects in Class XII and 75 in Class X. If the exam of all subjects is conducted, entire duration of exam would be about 45-50 days. So CBSE would conduct exams of following subjects by fixing date sheet across all affiliated schools in India & abroad: CBSE pic.twitter.com/vpyG761ngL
12. 500 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు ఇద్దరు అబ్జర్వర్లను నియమిస్తారు.
13.సీబీఎస్ఈ అన్ని పరీక్షా కేంద్రాల్లో సిటీ కోఆర్డినేటర్లను కూడా నియమిస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.