హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

CBI Internship: ఆ విద్యార్థులకు శుభవార్త.. స్పెషల్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తున్న సీబీఐ.. వివరాలివే

CBI Internship: ఆ విద్యార్థులకు శుభవార్త.. స్పెషల్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తున్న సీబీఐ.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI).. లా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేయనుంది. ఈ మేరకు దేశంలోని వివిధ లా స్కూల్స్‌ స్టూడెంట్స్‌ నుంచి దరఖాస్తులను ఆహ్వాస్తోంది. ఎంపికైన అభ్యర్థులను ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, లక్నో, బెంగళూరులోని సీబీఐ కార్యాలయాలకు కేటాయించనున్నారు.

ఇంకా చదవండి ...

కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI).. లా ఇంటర్న్‌షిప్ (Internship) ప్రోగ్రామ్‌ను లాంచ్ చేయనుంది. ఈ మేరకు దేశంలోని వివిధ లా స్కూల్స్‌ స్టూడెంట్స్‌ నుంచి దరఖాస్తులను ఆహ్వాస్తోంది. ఎంపికైన అభ్యర్థులను ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, లక్నో, బెంగళూరులోని సీబీఐ కార్యాలయాలకు కేటాయించనున్నారు. మొత్తం 30 మంది ఇంటర్న్‌లను సీబీఐ (CBI) ఎంపిక చేయనుంది. ఈ ఇంటర్న్‌షిప్ 3 నెలల నుండి 6 నెలల పాటు ఉంటుంది.

అర్హత ప్రమాణాలు

ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థి భారతదేశ పౌరుడై ఉండాలి. గుర్తింపు పొందిన లా యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ మీడియంలో గ్రాడ్యుయేషన్ కోర్సు చేస్తున్న లా స్టూడెంట్ అయి ఉండాలి. ప్రస్తుతం 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ LLB కోర్సును అభ్యసిస్తూ ఉండాలి. ఇప్పటికీ కనీసం 4 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి.

Internship: బెస్ట్ కెరీర్ కోసం ట్రై చేస్తున్నారా.. ఈ ఇంట‌ర్న్‌షిప్‌ల వివ‌రాలు తెలుసుకోండి

దరఖాస్తు విధానం

అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను పూర్తి బయో-డేటాతో నిర్దేశించిన ప్రో- ఫార్మా(Annexure-A)లో పంపాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్థులు ఈ ఇంటర్న్‌షిప్‌లో ఎందుకు చేరాలనుకుంటున్నారు.. అందుకు కారణాలను 150-పదాల్లో రాసి పంపవలసి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను జూన్ 16లోపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (శిక్షణ), CBI అకాడమీ, హాపూర్ రోడ్, కమలా నెహ్రూ నగర్, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్- 201002 అనే అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది.

NHAI, Internship: నేషనల్ హైవే ప్రాజెక్టుల కోసం ఇంటర్న్‌షిప్.. ఎవరు అర్హులో తెలుసుకోండి?

ఇంటర్న్‌షిప్ కండిషన్స్

ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో ఎటువంటి స్టైఫండ్ చెల్లించరు. అభ్యర్థులు తమ బస, ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు వారే చేసుకోవాలి. అలాగే ఎలాంటి వైద్య సదుపాయాలు లేదా మరే ఇతర సౌకర్యాన్ని అందించడానికి సీబీఐ బాధ్యత వహించదు. CBIలో భవిష్యత్తులో ఉద్యోగానికి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఎలాంటి హామీ ఇవ్వదు.

నిర్దిష్ట అంశాలపై కోర్టు తీర్పులను పరిశోధించడం, కోర్టు అప్లికేషన్ అండ్ రిప్లైలను ప్రిపేర్ చేయడం, సాక్ష్యాధారాలను సమర్పించడం, కోర్టులో సాక్షులను విచారించడం, ట్రైల్ వర్క్, డేటా సేకరణ వంటి అంశాల్లో CBI లా అండ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు సహాయం చేయడానికి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్న్‌లకు అవకాశం కల్పించనున్నారు. సీనియర్ అధికారులు వారికి అవసరమైన ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్‌ను అందించనున్నారు. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేరే సమయంలో ఇంటర్న్‌లు “గోప్యత ప్రమాణం”పై సంతకం చేయాల్సి ఉంటుంది. తద్వారా వారు తమ ప్రవర్తనకు కట్టుబడి ఉండాలి.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ కూడా ఇంటర్న్‌షిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతదేశం, విదేశాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులు లేదా రీసెర్చ్ స్కాలర్‌లు NITI ఆయోగ్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నీతి ఆయోగ్‌కు చెందిన వర్టికల్స్, డివిజన్లు, సెల్స్‌లలో ఎంపికైన అభ్యర్థులు పనిచేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు niti.gov.in/internshipలో రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్న్‌షిప్ వ్యవధి కనీసం ఆరు వారాలు ఉంటుంది.

First published:

Tags: CBI, Internship, JOBS

ఉత్తమ కథలు